18.7 C
Hyderabad
January 23, 2025 03: 49 AM
Slider జాతీయం

రేట్ కంట్రోల్: ధరలు తగ్గేవి, ధరలు పెరిగేవి ఇవే

nirmala 7

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం ఏది తగ్గుతుంది ఏది పెరుగుతుది అనేది ఆసక్తి కలిగించే అంశం. అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో గణాంకాలను, ఇతర వివరాలను ఆమె చదివి వినిపించారు. ఎప్పట్లానే బడ్జెట్ అంటే కొన్ని వస్తువులపై ధరలు పెరగడం, కొన్నింటిపై తగ్గడం సహజం.

ఈ బడ్జెట్ లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవి: బడ్జెట్ తో ధరలు పెరిగేవి: కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు, సిగరెట్లు, వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు, స్కిమ్డ్ మిల్క్, టేబుల్ వేర్, పొగాకు ఉత్పత్తులు, వైద్య పరికరాలు, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్, కిచెన్ ఉపకరణాలు, రాగి, ఉక్కు, క్లే ఐరన్, ఫర్నిచర్, చెప్పులు.

బడ్జెట్ తో ధరలు తగ్గేవి: ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్, మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ముడి పంచదార, వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు, కొన్నిరకాల మద్యం, రసాయనాలు.

Related posts

జ్ఞాన స‌ముపార్జ‌న‌కు సోష‌ల్ మీడియా అడ్డంకిగా మారింద‌ని వ్యాఖ్య‌…!

Satyam NEWS

అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభ సందర్భంగా అన్నప్రసాద వితరణ

Satyam NEWS

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

Leave a Comment