40.2 C
Hyderabad
May 2, 2024 17: 29 PM
Slider ప్రత్యేకం

దిశా యాప్ ను ఎంత‌మంది డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా…!

#dishaapp

ఇంత‌వ‌ర‌కు మొత్తం….3 ల‌క్ష‌ల ,62,వేల 572…న‌మ్ముతారా……?

ఏపీ సీఎం జ‌గ‌న్ మాన‌స‌పుత్రిక ఏదంటే…పోలీస్ శాఖ లో దిశ‌. ఈ విభాగానికి మొద‌ట్లోనే ఓ డైర‌క్ట్ ఐపీఎస్ ర్యాంక్ క‌లిగిన అధికారిని అందులా ఓ లేడీ ఎస్పీని నియ‌మిండంతో  ఆ విభాగంపై సీఎం జ‌గ‌న్ కు ఉన్న శ్ర‌ద్ద ఏంటో విశిద‌మ‌వుతోంది.మహిళ‌లపై అందునా అమ్మాయిలపై జ‌రుగుతున్న అఘాత్యాల‌ను అరిక‌ట్టేందుకు ,నియంత్రించేందుకు నిర్దే|శించ‌బ‌డిన జిల్లాల్లో  ఏకంగా దిశ  పేరుతో ఏకంగా పోలీస్ స్టేష‌న్ ను నిర్మించింది…జ‌గన్ ప్ర‌భుత్వం. 

తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలోహాక్ వెహికిల్స్ బ‌దులు…ఏంగా  దిశ పేరుతో మొబైల్ వెహికిల్స్ రంగంలోకి దించింది..జిల్లా పోలీస్ శాఖ‌. ఇక దిశ‌కు సంబంధించి  ప్ర‌తీ ఒక్క‌రికి  దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే చ‌ర్య‌లునూ చేప‌డుతున్నారు…లేడీ పోలీస్ బాస్. దీపిక‌.

ఈ క్ర‌మంలోనే  జిల్లా వ్యాప్తంగా జ‌రిగిన నేర స‌మాచారాన్ని ఒక‌సారి చూస్తే…. జ‌గ‌న్ మాన‌స‌పుత్రిక అయిన దిశా  యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. మొత్తం 2,707 మంది  దిశా యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు.

వీటితో దిశా  యాప్ ఇంత వరకు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 3,62,572 కు చేరింది..ఇక‌ ఎస్పీ దీపిక  పర్యవేక్షణ లో  మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియు ఎస్ఈబీ పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా రైడ్స్ నిర్వహించారు.దీంతో  8 కేసులు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 50 లీటర్ల నాటుసారాను, 5.22 లీటర్ల ఐ.ఎం.ఎల్.ఎఫ్. మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా నాటుసారా తయారీకి సిద్దం చేసుకొన్న 250 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను ధ్వంసం చేశారు.ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై  34 కేసులను పోలీసులు నమోదు చేశారు.అలాగే  మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 18 కేసులను పోలీసులు నమోదు చేశారు.

అదే విధంగా హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించని వాహనదారులు, అతి వేగంగా వాహనాలను నడిపిన వారిపైన, ఎంవి నిబంధనలను అతిక్రమించిన వారిపైన 814 కేసులను నమోదు చేసి,  1,90,360- లను ఈ చలానగా విధించారు. .ఇలా మొత్తానికి పోలీసు అధికారులు, మహిళా పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి నేరాలు జరుగుతున్న తీరును వివరించి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

Related posts

విధులకు గైర్హాజరు… అయితే రిజిస్టర్లో మాత్రం సంతకాలు

Satyam NEWS

కరోనా సమయంలో ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పి ప్రతినిధుల బృందం

Satyam NEWS

Leave a Comment