42.2 C
Hyderabad
May 3, 2024 15: 49 PM
Slider నిజామాబాద్

రెడ్డిలను విస్మరిస్తే కేసీఆర్ కు సత్తా చూపిస్తాం

#reddy

రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి హెచ్చరిక

రెడ్డిలను విస్మరిస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అది ఇప్పటికి అమలుకు నోచుకోలేదన్నారు. ఐదేళ్లలో మంత్రులు, సీఎస్ లను కలిసినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కూడా వారి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయం మొత్తం కామారెడ్డి కేంద్ర బిందువుగా సాగుతుందని, ఇక్కడికి కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు రావడంతో ఇదే సమయంగా తాము ఈ డిమాండ్ సాధనకు ముందుకు సాగుతున్నామన్నారు. రేపటి సభలో సీఎం కేసీఆర్, 10 న జరిగే కాంగ్రెస్ సభలో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి సైతం తమ డిమాండ్ ను ఆ ఆపార్టీ మేనిఫెస్టోలో చేర్పించాలన్నారు. లేకపోతే ఈ నెల 19 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా నుంచి  సుమారు లక్ష మంది రెడ్డిలతో ఆత్మీయ సమ్మేళనం చేపడతామన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఎంపీపీ, జడ్పీటీసీ వివాదంలో వారి సామాజిక వర్గం వ్యక్తిని కాపాడి ఇంకొకరిని సస్పెండ్ చేయడం సరికాదన్నారు. కేటీఆర్ వస్తే మమ్మల్ని పిలిచి మాట్లాడకుండా అవమానించారని, లోకల్ నాయకులు మాతో అవసరం లేదన్నట్టుగా ప్రవర్తించారన్నారు. రేపు సీఎంతో కలిపిస్తామని చెప్పారని, రేపు సీఎం తమను కలిస్తే కార్పొరేషన్ అంశాన్ని ప్రకటించాలని కోరుతామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొలిమి రాజ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

సొంత ఆస్తులు పంచుతున్నావా? ప్రతిదానికీ నీ పేరెందుకు?

Satyam NEWS

కురుమ విద్యార్ధుల ఉన్నత చదువులకు సహకరిస్తా

Satyam NEWS

మల్దకల్ లో ఘనంగా తులసి కళ్యాణం

Satyam NEWS

Leave a Comment