28.7 C
Hyderabad
April 27, 2024 03: 07 AM
Slider ప్రత్యేకం

కురుమ విద్యార్ధుల ఉన్నత చదువులకు సహకరిస్తా

#pasamyadagiri

కురుమ విద్యార్ధులు ఐఎఎస్‌, ఐపిఎస్‌ చదువులకు కావాల్సిన ఆర్దిక సహాయంతో పాటు హాస్టల్‌ వసతి  ఖర్చులను భరిస్తానని కురుమ ట్రస్ట్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ దేవర రాజేశ్వర్‌ కురుమ హామీ ఇచ్చారు. తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగె మల్లేష్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించి 74 సవత్సరాలవుతున్నా రాష్ట్రంలో కురుమ సామాజిక వర్గం నుంచి ఒక్క ఐఎఎస్‌, ఐపిఎస్‌ స్థాయి అధికారి లేకపోవడం విచార కరమని అన్నారు.

ఆదివారం ఉప్పల్‌లోని  బీరప్పస్వామి దేవాలయంలో జనగాయ జిల్లా లింగాల ఘనపురం గ్రామానికి చెందిన దయ్యాల సత్యనారాయణ కురుమ కుమారుడు, దయ్యాల కొమరయ్య మనమడు అనిరుద్‌ కురుమ నీట్‌ పరీక్షలో ఆల్‌ఇండియా 4వ ర్యాంకు, ఇంటర్‌నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌లో  గోల్డ్‌మెడల్‌  సాధించిన మాధారం చిరుచరణ్‌ కురుమలను, వారి తల్లిదండ్రులను, గురువులను సత్కరించారు.

ఆదివారం ఉప్పల్‌లోని బీరప్పస్వామి దేవాలయంలో కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగె మల్లేష్‌, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొరిగె రమేష్‌, పాశం యాదగిరి లు ముఖ్య అతిధులుగా పాల్గొని ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమం  ఉప్పల్‌ నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షకార్యదర్శులు  రేవు కృష్ణయ్య కురుమ, చౌదరిపల్లి పర్వతాలు కురుమ ఆద్శర్యంలో జరిగింది. ఈ  సందర్బంగా వారు మాట్లాడుతూ   కురుమ విద్యార్ధులు ఐఎఎస్‌ ,ఐపిఎస్‌ లుగా  ముందుకు సాగాలని, ప్రభుత్వ విధానాలు రూపొందించే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. నీట్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా 4 వ ర్యాంక్‌ సాధించిన అనురిద్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కురుమ యువత చదువుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కురుమ ఆణిముత్యాల అభివృద్దికి కురుమ సంఘం పాటుపడాల్సిన అవసరాన్ని  అందుకు అనుగుణంగా విది విధానాలను రూపొందించాలని సంఘానికి సూచించారు.

కార్యక్రమంలో సంఘం నాయకులు గొరిగ కృష్ట కురుమ, గొరిగె ఐలయ్య కురుమ, చిదం వెంకటేష్‌ కురుమ, శగా పెంటయ్య కురుమ, కర్రె శ్రీనివాస్‌ కురమ, జూకంటి రవీందర్‌కురుమ, ఒగ్గు చంద్రశేఖర్‌ కురుమ, నారీ వెంకటేష్‌ కురుమ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

Bhavani

రామనామం రాయటం లో బామ్మ బాటలో చిన్నారి…!

Satyam NEWS

పెంట్లవేల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

Satyam NEWS

Leave a Comment