25.7 C
Hyderabad
June 22, 2024 06: 33 AM
Slider పశ్చిమగోదావరి

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి: ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

#CITU Eluru

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ నిర్లక్ష్యానికి పచ్చి బాలింత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండురోజుల ఆపసికందు ను తనివితీరా చూసి ముద్దాడాలనుకున్న ఆ తల్లి ఇకలేదని ఆ పసికందును తెలియదు.

ఈ ఘటన పట్ల జిల్లా ఎస్ సి ఎస్ టి కుల సంఘాలు స్పందించాయి. డాక్టర్ నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మృతురాలిది  పెదవేగి మండలం బి సింగవరం గ్రామం.  నాగులపల్లి జ్యోతి భర్త నాగులపల్లి రమేష్. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం చేర్చగా 3న ఆపరేషన్ చేసి డాక్టర్లు పసికందును తీయడం జరిగింది.

తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారని డాక్టర్లు జనరల్ వార్డ్ కి తరలించారు. 4న తల్లికి సీరియస్ గా ఉందని  ఆక్సిజన్ పెట్టాలని పెద్ద ప్రాణానికి ప్రమాదం గా ఉందని ఐ సి యు కి తర లించిన డాక్టర్ కొద్దీ సేపటికి జ్యోతికి  ఇంజక్షన్ చేశామని బాగానే ఉందని చెప్పారు.

ఐదు నిమిషాల తర్వాత వచ్చి జ్యోతి చనిపోయిందని డాక్టర్ చెప్పడం తో మృతురాలి కుటుంబ సభ్యులు ఒక్క సారిగా షాక్ అయ్యారు.  డాక్టర్లు శవాన్ని త్వరగా తీసుకెళ్లాలని బాడీ దుర్వాసన వస్తుందని బంధువుల హడావిడి చేసి చేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే జ్యోతి చనిపోయిందని ఎస్సీ ఎస్టీ నాయకులను ఆశ్రయించి గవర్నమెంట్ హాస్పిటల్ లో వద్ద  ఆందోళన చేపట్టడం జరిగింది

దీంతో సూపర్ మెంట్ ఏ వి ఆర్ మోహన్  టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్  ఎస్ ఐ కిషోర్ బాబు  సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అయినా వీడని  అనుమానం తో జ్యోతి శవా నికి పోస్టుమార్టం కూడా చేయకుండా బంధువులకు అప్పజెప్పారు. అయినా బంధువుల్లో మరింత అనుమానం పెరిగి జ్యోతి మృత దేహాన్ని రీపోస్టుమార్టం చేయాలని నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్ని డిస్మిస్ చేయాలని ఎస్సీ అట్రాసిటీ హత్య నేరం విచారణ చేసి శిక్షించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దళిత సంఘాలు జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ఏ వి ఆర్ మోహన్ ని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

తక్షణమే నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాన్ని బలి కొన్న డాక్టర్ ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆ పసికందుకు ప్రభుత్వం ఉచిత విద్య అందించాలని పలు దళిత సంఘాల నాయకులు కలవడం జరిగింది. నాగులపల్లి జ్యోతి కుటుంబానికి తగిన న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ఎరుకల సంఘం దళిత సంఘాలు సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు దళిత యువసేన రాష్ట్ర అధ్యక్షులు j రవి ప్రకాష్ మాలమహానాడు రాష్ట్ర నాయకులు అబ్బూరి అనిల్ జిల్లా నాయకులు నూక పెయ్యి కార్తీక్ మహిళా నాయకురాలు నమ్మిన లక్ష్మి మహిళా నాయకులు  హేమలత ఏలూరు ఇంచార్జ్ దేవరపల్లి రత్నబాబు అక్షరపు లోకేష్ కొమ్ము జాన్ మైనార్టీ నాయకులు షేక్ బాజీ సుందర దాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం జిల్లాలో మరో సూది మందు మర్డర్

Satyam NEWS

23న టీడీపీ తొలి జాబితా

Bhavani

ఈ సారి శబరిమలకు వెళ్లాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి

Satyam NEWS

Leave a Comment