Slider నల్గొండ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు విడుదల చేయండి

#RDO Hujurabad

బిసి, ముస్లిం మైనారిటీలకు తక్షణమే కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి. అజీజ్ పాషా ఈ మేరకు హుజూర్ నగర్ ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన అనంతరం అజీజ్ పాషా పాత్రికేయులతో మాట్లాడుతూ గత సంవత్సరన్నర కాలం నుండి దరఖాస్తు చేసుకుని స్థానిక అధికారుల విచారణ పూర్తి చేసినా చెక్కులు రాలేదని అన్నారు.

ఆర్డీవో లాగిన్ కి అప్లోడ్ చేసినా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు బిసిలు, ముస్లిం మైనార్టీలకు, అగ్రవర్ణాల్లో పేదలకు  కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులు రాక ప్రతిరోజు   నియోజకవర్గ వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ పాద ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యస్కే బిక్కన్ సాహెబ్,  కుక్కడపు మహేష్ గౌడ్, కస్తాల ముత్తయ్య,  దొంతగాని జగన్, కె. సైదులు,  యస్కె.రజాక్ బాబా తదితరులు  పాల్గొన్నారు.

Related posts

అశోక్ బంగ్లా నుండీ “భవిష్యత్తు కై టీడీపీ బస్ యాత్ర” ప్రారంభం…!

mamatha

గోవుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు డీజీపీ ఆదేశం

Satyam NEWS

తిరుమల కొండపై ఉగ్రవాద మూకల గురి

Satyam NEWS

Leave a Comment