33.7 C
Hyderabad
April 29, 2024 02: 54 AM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు

#voters

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం. ఈసీ గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు.

గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.మరోసారి ఓటు నమోదుకు అవకాశం

రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలకు మరో అవకాశం లభించింది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, ఓటును వేరే ప్రాంతానికి మార్చాలనుకొనే వారికి ఈసీ మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

సెప్టెంబర్‌ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Related posts

సీసీ కెమెరాల పనితీరు పరిశీలించిన ఖమ్మం పోలీస్ కమిషనర్

Satyam NEWS

సక్సెస్ సెల్ఫీకి ప్రిన్స్ సంతకం

Satyam NEWS

మద్యం దొరికింది..తాగాడు..భార్యను కొట్టాడు..చనిపోయాడు

Satyam NEWS

Leave a Comment