38.2 C
Hyderabad
May 3, 2024 19: 35 PM
Slider కడప

రాజంపేట లో మలిశెట్టి పవనన్న ప్రజాబాట విజయోత్సవ ర్యాలీ

#rajampet

పవనన్న ప్రజా బాట 100వ రోజు విజయోత్సవ ర్యాలీని ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు శివారులో ఉండే ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అక్కడ నుండి ర్యాలీగా మెయిన్ రోడ్డు ద్వారా వజ్రం కళ్యాణ మండపం వరకు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో నియోజకవర్గంలోని ఆరు మండలాల జనసేన పార్టీ నాయకులు ,వీర మహిళలు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకట రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేట టౌన్ మినహాయించి పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.

ఇంటింటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచక పాలన గురించి వివరించి కరపత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు నుండి జనసేన పార్టీకి విశేష స్పందన లభిస్తుందన్నారు. 2024లో రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం వచ్చిన మన ఇంటి బిడ్డ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రానున్న 2024 ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు, విద్య వైద్య తోపాటు రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత పవన్ కళ్యాణ్ ది అన్నారు. మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, గృహనీలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. చట్టసభలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు. కాపులకు తొమ్మిదవ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. రాజంపేట ప్రజల అభివృద్ధి సంక్షేమమే నా లక్ష్యం అని, ఆ లక్ష సాధన కోసమే మీ ముందుకు వస్తున్నానని ఆదరించి ఆశీర్వదించాలని రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ కోరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పొలిశెట్టి శ్రీనివాసులు, రాటాల రామయ్య,ముఖరం చాంద్,అత్తిగారి దినేష్,వెంకటేశ్వర రావు,కీర్తన,బండ్ల రాజేష్,ఆకుల నరసయ్య,గురివి గారి వాసు భాస్కర పంతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జస్టిస్ ఫర్ విక్టిమ్:లైంగికదాడి కేసులో4గురు నిందితుల‌కు జీవిత ఖైదు

Satyam NEWS

నాలుగో విడ‌త‌లో 13,830 మందికి వాహ‌న‌మిత్ర ఆర్ధిక‌ స‌హాయం

Satyam NEWS

మహిళ రైతుల చెమట చుక్కలే చేనుకి జీవనాధారం

Satyam NEWS

Leave a Comment