సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ దళిత గిరిజన హాస్టల్ లో మెస్ కాంట్రాక్టర్ టిఆర్ఎస్ నాయకుడు ఒకరు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వస్తున్నా ఆరోపణలపై పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధాన నిందితుడైన తంగళ్ళపల్లి దేవయ్యపై కేసు నమోదు చేశామని మంగళవారం అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఎస్.సి బాలికల వసతి గృహం గాంధీనగర్ సిరిసిల్ల లో గత సంవత్సరం జూన్ 2019 లో క్యాటరింగ్ సెక్షన్ కాంట్రాక్టును తంగళ్ళపల్లి దేవయ్యఅనునతను తీసుకున్నాడు. ఇతను ఇద్దరు మహిళలు విజయ, మరియు మంజుల లను పనిలోకి పెట్టుకుని వంట చేయిస్తూ, క్లీనింగ్ సెక్షన్ కూడా చూసుకుంటాడు, ఇతను రెండు మూడు రోజులకు ఒక్కసారి హాస్టల్ కు వస్తూ, హాస్టల్ లో ఉండే అమ్మాయిలతో, వార్డెన్ హాస్టల్ లో లేనప్పుడు, అసభ్యంగా ప్రవర్తించడం, ఈ విషయం ఎవరికైన చెబితే చంపుతా అని బెదిరిస్తున్నట్లు వెల్లడి అయినది.
ఇతనికి తోడుగా విజయ అను వంట మనిషి కూడా అమ్మాయిలను మభ్య పెడుతున్నట్లు తెల్సినది. కావున హాస్టల్ లో మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న తంగళ్ళపల్లి దేవయ్య మరియు అతనికి సహకరిస్తున్న విజయల పై హాస్టల్ వార్డెన్ భూదేవి చెసిన పిర్యాదు పై Cr.No. 81/2020 U/Sec. 354, 354-A, 506 IPC, Sec 7 r/w 8 of POCSO Act-2012 మరియు Sec. 3(1) (w) (ii) of SC/STs (POA) Amendment Act-2015, Act of 1 of 2016 ప్రకారం సిరిసిల్ల పి.యస్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.కెసు నమోదు ఐ న 12గంటల్లో దేవయ్య ని పట్టుకోవడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా షీ-టీమ్ బృందం ప్రతి కాలేజ్ లలో,పాఠశాలలో ,బాలికల హాస్టల్ లలో అవర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే రాజన్న సిరిసిల్ల షీ-టీం వాట్సాప్ నెంబర్ 7901132141. 24/7 అందుబాటులో ఉంటుంది.ఈ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు కంప్లైంట్ చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయ్.ఎవరైనా మహిళల పై అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటివరకు జిల్లా షీ-టీం బృందం 178 అవర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. షీ టీం బృందం వరకు రెగ్యులర్ గా ప్రోగ్రాం చేయడం జరుగుతుందాని అయన అన్నారు.
ఇందులో భాగస్వాములైన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు. జిల్లాలోని ప్రతి కళాశాల, స్కూల్ లో షీ టీమ్స్, 100 డయల్ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మహిళల వేధింపుల కేసులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లను మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని నిజమైన వీడియోలను, ఫిర్యాదులను అందించాలని సూచించారు.