30.7 C
Hyderabad
May 13, 2024 00: 08 AM
Slider రంగారెడ్డి

రేవంత్ రెడ్డి కో హటావో.. కాంగ్రెస్ కో బచావో..

#singireddy

గతంలో రేవంత్ రెడ్డికి శాయశక్తుల కృషి చేసి ఎంపి గా గెలిపించానని, రాబోవు ఎన్నికలలో రేవంత్ కు వ్యతిరేకంగా పని చేస్తానని ఉప్పల్ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 300 మంది రేవంత్ బాధితులు ఉన్నారనీ, మాతో వందల కోట్లు ఖర్చు చేయించాడని అన్నారు. కొడంగల్ లో రేవంత్ ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తానని సింగిరెడ్డి అన్నారు. రేవంత్ బాధితులు అంత తనతో రావాలని.. అందరి తరుపున తాను కొట్లాడ్తానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి హటావో.. కాంగ్రెస్ బచావో.. అంటూ అన్ని నియోజకవర్గాల్లో కాళ్లకు గజ్జెలు కట్టుకుని తిరుగుతా… రేవంత్ ని ఓడగొడుతానని ఉప్పల్ నియోజకవర్గం సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 

గత తొమ్మిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నామని, వారి ఫ్యామిలీ ఉప్పల్ నియోజకవర్గంలో పేరున్న ఫ్యామిలీ అనీ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండు సీట్లయితే.. అందులో తన భార్య కార్పొరేటర్ గా గెలిచిందన్నారు. ఉప్పల్ లో తనకు టికెట్ ఇస్తే  గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయి కానీ టికెట్ మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో టికెట్ ఇస్తామన్నారని అయితే ఇవ్వలేదని ఆ తరువాత 2018లో ఇస్తామన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా ఇవ్వలేదు. పార్టీ సచ్చిపోతుంది అనుకున్నప్పుడు పార్టీలో ఎవరు లేరు, నేను మాత్రం అలాగే కొనసాగుతున్నానని ఆయన తెలిపారు. తాను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని.. ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్నానని అన్నారు.

కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా తన పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదు. బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడని అన్నారు. ఒక డివిజన్ కి కూడా తెల్వని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడని అన్నారు. టీడీపీ లాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నాడని, సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని రేవంత్ నిర్మించుకున్నాడని తెలిపారు. ఉత్తమ్ కి సీఎం పదవి వస్తే తనకు నష్టమని రేవంత్ ఇదంతా చేస్తున్నాడని, రేవంత్ కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆరోపించాడు. టికెట్ రాకపోవడంతో నా నియోజకవర్గంకు పోవాలంటే సిగ్గు అవుతుందని, 15రోజుల నుంచి ఢిల్లీలో దాకున్నానని అన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కన పెడితే బిఆర్ఎస్ ని ఎలా ఎదిరిస్తారని, ఉప్పల్లో పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. నాకు నా ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతానని తెలిపారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

మైదానంలో కేక పుట్టించిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Sub Editor

టు స్మార్ట్: సూపర్ మచ్చి ఫస్ట్ లుక్ అదుర్స్

Satyam NEWS

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

Leave a Comment