40.2 C
Hyderabad
April 28, 2024 16: 04 PM
Slider ముఖ్యంశాలు

స్వర్ణ కవచాలంకారంలో స్వయంవ్యక్త కనకదుర్గమ్మ తల్లి

#kanakadurga

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మొదటి రోజు ఆదివారం స్వయంవ్యక్త శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రాతఃకాల సమయంలో సుప్రభాత సేవ, పంచసూక్తాలతో,పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనము, నవగ్రహారాధన,అఖండ దీపారాధన,కలశ స్థాపన,కల్పోక్త ప్రకారంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, సాయంసమయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు,రజిత కవచాలతో సర్వాంగసుందరంగా అలంకరించి,సహస్ర నామాలతో కుంకుమార్చన,ధూప,దీప,నైవేద్యాలు సమర్పించి మహానీరాజన మంత్రపుష్పం సమర్పించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.

ప్రధాన అర్చకులు నరగిరినాధుని రంగ భట్టాచార్యులు,పోతావఝ్ఝుల ఫల్గుణ శర్మ నేతృత్వంలో విశేష పూజలు జరిగాయి. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ కనకదుర్గ అమ్మవారిని సేవించి తరించారు.స్థానిక భజన మండలి భక్తి గీతాలు ఆలపించారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

మరో పోరాటానికి సిద్ధం కావాలని తీన్మార్ మల్లన్న పిలుపు

Satyam NEWS

ఇడుపులపాయలో ప్రయివేటు స్కూల్ కరస్పాండెంట్ల దీక్ష భగ్నం

Satyam NEWS

విజయవాడ సీపీగా వచ్చేసిన బత్తిన శ్రీనివాసులు

Satyam NEWS

Leave a Comment