30.7 C
Hyderabad
April 29, 2024 06: 05 AM
Slider ముఖ్యంశాలు

భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీ

#ktr

హుజూర్ నగర్ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రులు కెటిఆర్, జగదిష్‌ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌మాద‌క‌ర‌మైన పార్టీ అని,దాని ఉచ్చులో యువ‌త ప‌డొద్దు అని,బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు.మ‌తాల మ‌ధ్య పంచాయ‌తీ పెట్ట‌డం బిజెపి ప‌ని అని ధ్వ‌జ‌మెత్తారు. కిష‌న్ రెడ్డి లాంటి వ్యక్తి నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతున్నారని,ఆయ‌న మాట్లాడేవ‌న్ని అబద్ధాలని అన్నారు.నిల‌దీస్తే ఒక్క స‌మాధానం కూడా చెప్ప‌డ‌ని మండి ప‌డ్డారు.

బిజెపి వ‌ల్ల కార్పొరేట్ శ‌క్తులు బాగుప‌డ్డాయని,ప్ర‌జ‌లు మాత్రం మ‌రింత అగాధంలోకి వెళ్లారని,మోదీ వ‌ల్ల దేశం అప్పుల‌ పాలైందని,దేశం అభాసు పాలైంద‌ని అన్నారు.దేశానికి వేగు చుక్క మ‌న తెలంగాణ అని మంత్రి కెటిఆర్ స్ప‌ష్టం చేశారు.భార‌త‌దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌ని తెలిపారు.30 వేల కోట్ల‌ రూపాయలతో దామ‌ర‌చ‌ర్ల‌లో అల్ట్రా మెగా వ‌ప‌ర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వం అని స్ప‌ష్టం చేశారు.నేడు ఇంటింటికి సిఎం కెసిఆర్ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయని, భారతదేశం లోనే తెలంగాణా గ్రామ పంచాయ‌తీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు.ఉప ఎన్నికల తర్వాత హుజుర్‌నగ‌ర్‌ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింద‌ని అన్నారు. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాల‌ని సూచించారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్‌ గా మారింది దేశాన్ని బాగు చేయాలన్నదే కెసిఆర్ లక్ష్యం అని కెటిఆర్ తేల్చిచెప్పారు.

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బిజెపి నాయ‌కులని కెటిఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాల‌ని కుట్రలు చేస్తున్నది బిజెపి అని మండిప‌డ్డారు.బిజెపి వల్ల ఒక దళితుడు గాని,ఒక గిరిజన వ్య‌క్తిగాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని స్ప‌ష్టం చేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

దేశంలోని గిరిజనులందరికీ మొబైల్ నెట్వర్క్ కవరేజీ అందుతుందా?

Bhavani

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

Satyam NEWS

హైదరాబాద్‌లో ప్రారంభమైన అమితాబ్‌ –అజయ్‌ దేవగణ్‌ ‘మే డే’

Satyam NEWS

Leave a Comment