26.7 C
Hyderabad
May 12, 2024 07: 10 AM
Slider

తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

#Revanth Reddy

సీనియర్ రాజకీయనేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇందుకు సంబందించిన రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైద్రాబాద్ లోని తుమ్మల నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఉపాధ్యక్షడు మల్లు రవి , మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి తుమ్మలను కలిసి కాంగ్రెసులోకి రావాలని ఆహ్వానించారు .. తుమ్మల కాంగ్రెస్ నేతలకు శాలువా కప్పి ఆహ్వానించారు .

వారితో చర్చించారు . అన్ని అనుకూలిస్తే సెప్టెంబర్ నెల మొదట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయింది. తుమ్మల టీడీపీ లో, తెరాస లలో మంత్రిగా పనిచేసారు. ఆయన కొంతకాలంగా కెసిఆర్ కు సన్నిహితునిగా పేరున్న తుమ్మల బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేదు. దాంతో తన సత్తా నిరూపించుకునేందుకు ఆయన వందలాది కార్లతో ఖమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ యస్ జెండా ఒక్కటి కూడా కనిపించలేదు. పైగా కాంగ్రెస్ జెండా దర్శనమిచ్చింది.

ఈ నేపథ్యంలో తుమ్మల నాగశ్వరరావును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తుమ్మలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే సెప్టెంబరు రెండో వారంలో రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

Related posts

ఆర్టీసీ సమ్మె పిటీషన్ 15వ తేదీకి వాయిదా

Satyam NEWS

కంటి ఆపరేషన్లు చేసుకున్న వారిని పరామర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

ఎస్వీబీసీ ఛానల్ పై సమీక్ష

Murali Krishna

Leave a Comment