38.7 C
Hyderabad
May 7, 2024 18: 26 PM
Slider ఖమ్మం

రైస్ మిల్లు సీజ్

#Rice mill

జిల్లాలోని పెనుబల్లి మండలం అరిసెల్లపాడు గ్రామంలోని శ్రీలక్ష్మి శ్రీనివాస పారా బాయిల్డ్ రైస్ మిల్లును సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ధాన్య సేకరణలో భాగంగా మిల్లుకు కేటాయించిన ధాన్యం తీసుకోకుండా, తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టడం, స్వంతంగా ధాన్యం కొనుగోలు చేసి,

అట్టి ధాన్యానికి సంబంధించి రిజిస్టర్లు తనిఖీ అధికారులకు చూపకపోవడం, అధికార యంత్రాంగం సూచనలు పెడచెవిన పెట్టడంతో రైస్ మిల్లును సీజ్ చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలో 64 రైస్ మిల్లులు ఉన్నట్లు, జిల్లా వ్యాప్తంగా 232 ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, సేకరించిన ధాన్యాన్ని కేంద్రాలకు దగ్గరలోని రైస్ మిల్లులకు ట్యాగ్ చేసినట్లు

ఆయన తెలిపారు. మిల్లుల ద్వారా ధాన్య సేకరణ సజావుగా జరుగుతున్నట్లు, కొన్ని మిల్లులు తరుగు పేరిట రైతులకు ఇబ్బందులు కల్గిస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ధాన్య సేకరణకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని, తరుగు పేరిట, అన్లోడ్ పేరిట రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించార

Related posts

ఇచ్చిన మాట నిలుపుకున్న కేటీఆర్

Satyam NEWS

ఎమ్మెల్యే కార్పొరేటర్ వార్ : శిలాఫలకాల వద్ద కాంగ్రెస్ ఆందోళన

Bhavani

గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

Satyam NEWS

Leave a Comment