32.7 C
Hyderabad
April 27, 2024 02: 52 AM
Slider మహబూబ్ నగర్

పోలీస్, మునిసిపల్ అధికారులపై క్రిమినల్ కేసు

#complaint

వనపర్తిలోని తమ స్థలం సొంత యాజమాన్య హక్కు గల స్థలంలో  ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్న సందర్భమున వనపర్తి పట్టణ పోలీసు అధికారులు, మునిసిపల్ అధికారులు  ప్రహరీ గోడ నిర్మాణాన్ని అక్రమంగా కూల్చివేసినందుకు    వనపర్తి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో క్రిమినల్  కేసు నమోదు అయిందని బండారు ఉదయ్ తెలిపారు. పోలీస్, మునిసిపల్ అధికారుల గురించి కోర్టులో సిఆర్పిసి సెక్షన్ 190,200 ప్రకారం ప్రైవేట్ పిర్యాదు దాఖలు చేయగా సిసి నంబర్ 281/23 కేటాయించారని అయన తెలిపారు.

వనపర్తి టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి, ఎఎస్ఐ మన్యపురెడ్డి, మునిసిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి సుధాకర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుమన్,మరో 5 గురిని నిందితులుగా చేర్చారని చెప్పారు. కాంపౌండ్ గోడను జెసిబి ద్వారా కులగొట్టారాని, నాలుగు లక్షల రూపాయలు నష్టం జరిగిందని చెప్పారు. క్రిమినల్ ట్రెస్ పాస్ చేసి,5 గురు నిందితులు అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు 2023 జులై 18న కోర్టుకు (పది మంది) హాజరు కావాలని వనపర్తి మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఫుల్ అడిషనల్ ఛార్జ్ జడ్జి యెగి జానకి ఆర్డర్ ఇచ్చారు. నిందితులకు సమన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఐపిసి సెక్షన్ 166,427,447,506 ప్రకారం (అధికారులు అనగా ఎ1 నుండి ఎ5) నిందితులు వ్యవహరించి, గోడ కూలాగొట్టారని క్రిమినల్ ట్రెస్ పాస్ చేసి, అధికార దుర్వినియోగం చేసి గోడ కూలాగొట్టారని ఆర్డర్ లో ఉంది.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

జి ట్యాంకర్ పేలుడులో 18 మంది భారతీయుల మృతి

Satyam NEWS

తెలుగు రాజకీయాల్లో ఆ నాటి సంచలనం కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

అనధికార బ్లాస్టింగ్ లు ఆపాల్సిందే లేకుంటే చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment