38.2 C
Hyderabad
May 3, 2024 20: 58 PM
Slider కడప

పాపాగ్ని నది పొంగడం తో రాకపోకలు బంద్

వైయస్సార్ జిల్లా పాపాగ్ని నది అప్రోచ్ రోడ్డు వద్ద భారీగా వరదనీరు చేరింది. దాంతో రాక పోకలు బంద్ చేశారు. భారీ వాహనాలు వెళితే అప్రోచ్ రోడ్డు కృంగిపోతుందని అధికారుల సూచనల మేరకు రాత్రి రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసుల వెల్లడించారు. కడప తాడిపత్రి జాతీయ రహదారి కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు కు ఆనుకొని భారీగా వరద నీరు చేరుకున్నది. అప్రోచ్ రోడ్డును పరిశీలించిన నేషనల్ హైవే ఏఈ దీపక్ రెడ్డి ఆయన సూచనల మేరకు రాకపోకలు నిలిపివేశారు. పాపాగ్ని మెయిన్ బ్రిడ్జి కట్టడానికి గత నెల 29వ తేది న ప్రభుత్వం టెండర్ల పిలిచింది. టెండర్లు పూర్తయితే త్వరితగతిన బ్రిడ్జి పూర్తి చేస్తామని నేషనల్ హైవే అధికారులు అంటున్నారు.

Related posts

సంక్రాంతికి ఆహ్వానం

Satyam NEWS

మన రైతు

Satyam NEWS

బైరి నవీన్ ను అరెస్ట్ చేయాలి: కైలాసగిరి అయ్యప్ప సేవ సమితి

Satyam NEWS

Leave a Comment