31.7 C
Hyderabad
May 2, 2024 08: 16 AM
Slider గుంటూరు

ఓటుకు ఆధార్ లింక్ చేయడం స్వాగతిస్తున్నాము

ఓటుకు ఫారం 6 బి ద్వారా ఆధార్ లింక్ చేయడం స్వాగతిస్తున్నామని గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.ఎన్నికల సంస్కరణల్లో భాగంగా మార్పులు అవసరం అన్నారు. ఓటుకు ఆధార్ లింక్100 శాతం అవసరమైన ప్రక్రియగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నవతరంపార్టీ నుండి కొత్త సంస్కరణలు స్వాగతిస్తున్నామన్నారు. ఓకే డోర్ నంబర్ లో ఉండే కుటుంబ సభ్యులకు ఓకే పోలింగ్ కేంద్రము ఉండేలా మార్పులు చేయాలని అన్నారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, వివిధ చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి వారు ఒక్క చోట మాత్రం ఓటు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారుపలు అంశాలపై చర్చించారు.

రాజకీయ పార్టీల నేతలు మరియు సాధారణ సమస్యలపై ప్రజలు ఇచ్చే వినతిపత్రం, ఫిర్యాదులకు తపాల విధానాన్ని గుంటూరు కలెక్టరేట్ లో అమలు చేయడం లేదని రశీదు కేవలం స్పందనలో మాత్రమే ఇస్తున్నారు అని,అన్నీ పిర్యాదు లకి రశీదు ఇవ్వాలని కోరారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి రావుసుబ్రహ్మణ్యం తమ దృష్టికి తీసుకువచ్చిన అంశంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జేసీ, మరియు డిఆర్వో చంద్రశేఖర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి రావుసుబ్రహ్మణ్యం ఫారం 6బి పోస్టర్ ను కలెక్టరేట్ లోని శంకరన్ సమావేశ మందిరం వేదికపై ఆవిష్కరించారు. సోమవారం ఆగస్టు ఒకటవ తేదీ ఉదయం పది గంటల సమయం లో కార్యక్రమం గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షత న జరిగింది. పల్నాడు, గుంటూరు జిల్లాలలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

Related posts

మంచినీటి ట్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

Satyam NEWS

మేడారం మహా జాతర తేదీల ఖరారు

Satyam NEWS

బహుజన గర్జనను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment