27.7 C
Hyderabad
May 14, 2024 06: 30 AM
Slider కవి ప్రపంచం

సంక్రాంతికి ఆహ్వానం

#MuluguLaxmimaidhili22

హేమంత ఋతువు లో

తెలి మంచువేళ

చేమంతుల సౌరభాలతో

ప్రతి ఇల్లూ సంక్రాంతి కి

స్వాగతమిస్తుంది

భోగి పండుగ నాడు

జగతిని పీడించే మహమ్మారిని

పాత వస్తువులతో పాటు

భోగి మంటల్లో మసిచేసి

పండుగ చేద్దాం.

భారతీయ సంస్కృతి కి

సంప్రదాయాలకు

జీవం పోసే

తెలుగింటి ముగ్గులతో

పడుచులు పాడే

గొబ్బి పాటలతో

హరిదాసు కీర్తనలతో

గంగిరెద్దుల ఆటలతో

చిన్నారులు ఎగిరేసే

గాలిపటాలతో

సందడి చేద్దాం.

బొమ్మల కొలువు పేరంటాలతో

పసివారిని దీవిస్తూ

పోసిన భోగి పళ్ళతో

పితృదేవతలకు మనసారా

అర్పించే తర్పణలతో

పాడి పంటలు సమృద్ధిగా

ఉండాలని..

పశువులను పూజిస్తూ

సంబరం చేద్దాం.

మారుతున్న

మకరరాశితో పాటు

మనందరి రాశులూ మారాలని

అందరి కోరికలు నెరవేరాలనీ

బాధలు, వేదనలు

సమసిపోవాలనీ

ప్రజలంతా సుఖశాంతులతో

ఆనందంగా ఉండాలని

సంక్రాంతి లక్ష్మి ని

ఆహ్వానిద్దాం.!!

ములుగు లక్ష్మీ మైథిలి, నెల్లూరు, ఫోన్:9440088482

Related posts

కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల

Murali Krishna

అక్రమ కేసులకు భయపడేవారు ఎవ్వరూ లేరు

Bhavani

జీహెచ్ఎంసి ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం

Sub Editor

Leave a Comment