37.7 C
Hyderabad
May 4, 2024 11: 38 AM
Slider కవి ప్రపంచం

మన రైతు

#PVS Krishnakumari

ఎవరన్నారు  అతను

బక్కచిక్కిన రైతని

ఎవరన్నారు అతను

చేతకాని వాడిలా 

ఆత్మహత్య చేసుకొనే పిరికిపందని

అతను భుజస్కందలములపై

మోస్తున్నది హలం కాదు

ఆత్మ స్థైర్యం

అతని కళ్ళల్లో తొణికిసలాడే

ఆ విశ్వాసం చూసి

ఎంతటి కష్టమైనా

భయపడి వెనుతిరగాల్సిదే

ఆకాశం కరుణించక పోతేనేం

భూపొరలను చీల్చి

పాతాళగంగను పైకి

రప్పించగలిగే సత్తా ఉన్న యోధుడు

పంచె ఎగ్గట్టి తలపాగా చుట్టి

పిడికిలి బిగించి అడుగులు వేస్తూ

కార్యరంగంలోకి దూకితే

కొండల్ని పిండిచేసి

బీడుభూముల్ని సైతం

సస్యశ్యామలం చేయగల ధీరుడే

మన రైతన్న

పీ.వి.యస్. కృష్ణ కుమారి, హైదరాబాద్

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన నటి త్రిష

Satyam NEWS

గంజాయి సమూలంగా నిర్మూలిద్దాం: విశాఖ రేంజ్ డీఐజి రంగారావు

Satyam NEWS

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

Satyam NEWS

Leave a Comment