25.2 C
Hyderabad
May 13, 2024 10: 23 AM
Slider

జాతీయ రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

#roadaccident

విశాఖ-రాయపూర్ జాతీయ రహదారిపై తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. విశాఖ నుంచీ రాయపూర్ వెళుతున్న రిలయన్స్ ఆయిల్ ట్యాంక్ టైర్ ఒక్క సారి పేలింది. దీంతో బోల్తాపడి..రోడ్ పక్కనే పడిపోయింది. కళ్లముందు ప్రమాదాన్ని చూసిన సుంకరిపేట కుర్రాళ్లు ఇచ్చిన సమాచారం తో ఘటనా స్థలికి ఏఎస్పీ అనిల్ హుటాహుటిన చేరుకున్నారు.

ఆయిల్ ట్యాంకర్ పేలకుండా వెనువెంటనే చర్యలు తీసుకున్నారు. అయిదు ఫైర్ ఇంజన్లను తీసుకు వచ్చి మంటలు ఎగిసిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.ముందు చూపుతో ఏఎస్పీ అటు వై జంక్షన్ ఇటు అయినాడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మీడియా తో మాట్లాడుతూ.. అయిల్ ట్యాంకర్ ప్రమాదం లో జాగ్రత్తలు తీసుకున్నామని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

తలసేమియా చిన్నారులకు రక్తం అందించిన జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS

పేద జర్నలిస్టు కుమార్తెకు ఐ.ఏ.ఎస్ సి.ఎస్.బి అకాడెమీ డైరెక్టర్ సాయం

Satyam NEWS

బి‌సి భవన్ త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment