26.7 C
Hyderabad
May 3, 2024 07: 19 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

#oldstudents

ముప్పై సంవత్సరాల స్నేహ బంధం ఒక్కచోట చేరేసరికి ఆప్యాయపు పలకరింపులతో వారి ఆనందానికి అవధులు లేవు. మరువలేని మరపురాని చిన్ననాటి రోజులు ఒక్కోక్కటిగా వారి ముందు ఆవిష్కృతమయ్యాయి. ఆలనాటి తీపి గుర్తులను స్మరించుకుంటూ వారి భవిష్యత్తుకు పునాదులు వేసిన గురువులతో సందడి వాతావరణం ఆవిష్కృతమైంది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని’విజయ విద్యా మందిర్’అరవై వసంతాల పాఠశాల చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆదివారం రోజున(వి.వి.ఎం)విజయ విద్యా మందిర్ పాఠశాలకు చెందిన 1981వ,సంవత్సరం నుండి 1991వ,సంవత్సరం వరకు విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థినీలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా ఒక్కచోట కలిశారు.ఈ అపూర్వ సమ్మేళన కార్యక్రమం హుజూర్ నగర్ పట్టణంలోని స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా,వీనుల విందుగా జరిగింది.

ముందుగా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు ఆలిస్ టీచర్,అన్నమ్మ టీచర్, విజయ మేరీ టీచర్,భవాని టీచర్, ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు వసంత సిస్టర్ తో ఒక్కరొక్కరుగా పూర్వ విద్యార్ధినీలు వారి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం వారి ఉన్నతికి కారణభూతులైన గురువులను శాలువాలతో, పూల మాలలతో సన్మానించి,సత్కరించి గురువుల ఆశీర్వాదాలు పొందారు.

చిరుప్రాయంలో విజయ విద్యా మందిర్ పాఠశాలలో చిగురించిన వారి స్నేహబంధం ఎప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని విద్యాబుద్ధులు నేర్పిన గురువులు తమ శిష్యురాళ్ళకు తెలిపారు. చిన్నతనంలో చదువుకున్న పాఠశాలలో కొంత సమయం గడిపిన అనంతరం ఆట పాటలతో మధురమైన చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగాల నడుమ సాగిన అపూర్వ సమ్మేళనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.

ఈ ఆనంద పరవశ మధుర స్మృతుల సంగమ కేళీ వినోదంలో విద్యార్థులు హైమావతి,విశాలక్ష్మి,శ్రీదేవి,రమల,  నాగరాణి,రేణుక,విజయలక్ష్మి, నిర్మల, జ్యోతి,ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన

Sub Editor

మునిసిపల్ ఎన్నికలలో ఓటు వేయడం మన బాధ్యత

Satyam NEWS

రాజకీయ లబ్ది కోసమే రైతులతో సమావేశాలు

Satyam NEWS

Leave a Comment