40.2 C
Hyderabad
April 28, 2024 17: 09 PM
Slider నల్గొండ

తలసేమియా చిన్నారులకు రక్తం అందించిన జనచైతన్య ట్రస్ట్

#janachitanyatrust

జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల వేపల సింగారం గ్రామంలో సర్పంచ్ అన్నేం శిరీష కొండారెడ్డి  సహకారంతో శుక్రవారం తల సేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఖమ్మం పట్టణ సంకల్ప తలసేమియా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 40 మంది బ్లడ్ డోనర్ల ద్వారా రక్త సేకరణ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, జనచైతన్య ట్రస్ట్ వంశీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కట్టా వెంకట్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా మానవుని రక్తంపై తన ప్రభావాన్ని చూపిస్తుందని,శ్వాసతో పీల్చుకునే ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ హిమోగ్లోబిన్‌ అందిస్తుందని, తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదని అన్నారు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం అది నిల్వ ఉండదని,వారికి తిరిగి 15 నుండి 30 రోజుల్లో మళ్ళీ రక్తం ఎక్కించాలని అన్నారు.

ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు.హుజూర్ నగర్ పరిసర ప్రాంతాలలో రక్తం అవసరం ఉన్న దాదాపు 350 పైగా పేషంటులకు ఇప్పటివరకు జనచైతన్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగిందని,ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడం కంటే మించిన దానం ఉండదని,ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జనచైతన్య ట్రస్ట్ సభ్యుల కృషి  అభినందనయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు సులువ చంద్రశేఖర్, అధ్యక్షుడు పారా సాయి,ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్,ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి రమేష్,జయంత్,అహ్మద్,ఎస్.నవీన్, శ్రీపతి,డి.నవీన్ రాజు,సీత కిరణ్ సాయి,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

వరద సాయం కొట్టేస్తున్న అధికార పార్టీ నేతలు

Satyam NEWS

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Bhavani

కొండగట్టుకు రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు

Bhavani

Leave a Comment