30.2 C
Hyderabad
May 13, 2024 12: 51 PM
Slider హైదరాబాద్

అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

#golnaka

హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్లో అక్రమంగా వసూలు చేసిన వారిపై, రోడ్లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని గోల్నాక డివిజన్ కార్పొరేటర్  దూసరి  లావణ్య శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అన్నపూర్ణ నగర్ మెయిన్ రోడ్ లో గల ఇటుక ఇసుక కంకర వ్యాపారం పేరుతో రోడ్లను అక్రకమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గోల్నాక డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నామని ఎలాంటి  అక్రమ వసూళ్లు కానీ రోడ్లను ఆక్రమించడం కానీ  తమ దృష్టికి తీసుకొని వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గోల్నాక డివిజన్ ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల పక్షాన ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సమస్య ఎదురైనా తక్షణమే ఆ సమస్య తీర్చడానికి ముందుంటామని తెలిపారు. గోల్నాక డివిజన్ ని సమస్య రహిత డివిజన్ గా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. గోల్నాక డివిజన్లో ఇలాంటి సమస్య అధికారుల దృష్టికి వచ్చినా తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించే దిశగా నడవాలని అధికారులను సూచించారు.

Related posts

స్టేష‌న్ భ‌వనం నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎస్పీ దీపిక….!

Satyam NEWS

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసుల సస్పెన్షన్

Satyam NEWS

కబుర్లు చెప్పడం కాదు ఒక్కొక్కరు 10 లక్షలు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment