ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ఎం జి ఆర్ షాపింగ్ మాల్ వారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకు అందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎంజీఆర్ షాపింగ్ మాల్ రాయల్ ఎన్ఫీల్డ్ (ROYAL ENFIELD) బంపర్ డ్రా కార్యక్రమానికి ఆయన నేడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తిరుపతి తీర్థకట్టవీధి లోని ఎంజీఆర్ షాపింగ్ మాల్ అనతికాలంలోనే నగర ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని ఆయన తెలిపారు. వేకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరిన్ని కొత్త షో రూంలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎం జి ఆర్ షాపింగ్ మాల్ Royal Enfield కాంటెస్టులో తిరుపతి సాయి నగర్ కు చెందిన ముని వెంకటరెడ్డి విజేతగా నిలిచిచారు. ఆయనకు నవీన్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు.