38.2 C
Hyderabad
April 27, 2024 15: 44 PM
Slider నెల్లూరు

పార్టీలో చేరనందుకు రేషన్ డీలరైపై వైసీపీ ప్రతాపం

nellore TDP

వైసీపీలో చేరకపోతే రేషన్ షాప్ డీలర్ షిప్ రద్దు చేస్తారా? ఎస్ మేం చేస్తాం అంటున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు. కోవూరు నియోజకవర్గంలోని 10వ నెంబరు రేషన్ షాపు మస్తానమ్మ పేరుతో ఉంది. ఆమె భర్త రాజా రమణయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు.

30 సంవత్సరాల నుంచి వారు రేషన్ షాపు నడుపుతున్నారు. ఈనెల 11 వ తేదీ ఆ డీలర్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. కారణం ఏమిటంటే వారు ఎంత వత్తడి తెచ్చినా వైసీపీలో చేరడం లేదు. అందుకు వారికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇదేమని అడిగితే బెదిరిస్తున్నారు. ఏం చేయాలి?

అందుకే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు దర్గామిట్టలోని కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ మిరియాల వెంకట శేషగిరి రావు ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

కోవూరు నియోజకవర్గం లో గతంలో ఎవరు అధికారం లో ఉన్న రేషన్ డీలర్ల ను తెలిగించే సంస్కృతి లేదని, అయితే ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొత్త సంస్కృతికి  తెరలేపారని వారు కలెక్టర్ కు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుండి పార్టీలో కొనసాగుతున్న రాజా రమణయ్య ను గత ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరమని వత్తిడి తెచ్చారని వారన్నారు.

ఆయన అందుకు అంగీకరించలేదని ప్రసన్నకుమార్ రెడ్డి శాసనసభ్యుడు గా ఎన్నిక అయినప్పటి నుండి రాజా రమణయ్య భార్య మస్తానమ్మ పేరు పై ఉన్న 10 వ నెంబర్ రేషన్ షాపు ను ఏదో ఒక కారణం పెట్టి డీలర్ షిప్ తీసివేయాలని అధికారులు పై వత్తిడి తెచ్చారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

అదీ కూడా ఎన్నికలు కోడ్ అమలులోకి వచ్చిన తరువాత షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. కేవలం రాజకీ కక్ష సాధింపులో భాగంగా ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు కోరగా వారు విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Related posts

మానసిక వికలాంగురాలి పై అత్యాచారం

Satyam NEWS

భక్తులతో క్రిక్కిరిసిపోయిన తిరుమల గిరులు

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

Satyam NEWS

Leave a Comment