Slider సినిమా

ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ విడుదల కావడం లేదు

#Junior NTR

తన పుట్టిన రోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావడం లేదని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ముందుగా అనుకున్నా కూడా లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందనే నమ్మకం తనకు ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆయన అభిమానులను కోరారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఇంటి వద్దనే ఉండాలని ఆయన కోరారు. ఇలా ఇంటి వద్ద ఉండి భౌతిక దూరం పాటించడమే తనకు అభిమానులు ఇచ్చే పుట్టిన రోజు కానుకగా భావిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

Related posts

నిజాయితీ చాటుకున్న విలేకరి వహీద్

Satyam NEWS

జి.ఓ. నెంబర్ 3పై ప్రభుత్వం తక్షణమే రివ్యూ పిటిషన్ వేయాలి

Satyam NEWS

ఆక‌లి బాధ‌ను గుర్తించిన 1982 ఆర్సీఎం టెన్త్ బ్యాచ్….!

Satyam NEWS

Leave a Comment