29.7 C
Hyderabad
May 4, 2024 05: 06 AM
Slider ముఖ్యంశాలు

అయోధ్యలో రామ విగ్రహ స్థాపన రోజు ఇంట్లో దీపాలు వెలిగించాలి

#RSS

ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగి దాదాపు 95 ఏళ్లు పూర్తయినా నేటికి సంఘ్ లక్షల శాఖలతో దేశ సమగ్రత, హిందూ వైభవానికై ఫలాఫేక్ష ఆశించకుండా పని చేస్తోందని ఆర్ఎస్ ఎస్ క్షేత్ర సహ ప్రచారక్ భరత్ కుమార్ అన్నారు. విజయనగరం అయోధ్య మైదానంలో ఆర్. ఎస్. ఎస్ విజయ సంకల్ప సాంఘీక్ లో ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు అయోధ్యా మైదానంలో జరిగిన సాంఘీక్ లో దాదాపు 500మంది పాల్గొని సామూహికంగా యోగ అభ్యాసం చేశారు. ఈ సందర్భంగా భరత్ జీ మాట్లాడుతూ 1925లో కేవలం పది మందితో డాక్టర్ బలిరాం హెడ్గేవార్ స్థాపించిన సంఘ్ ప్రతీ రోజూ గంటసేపు జరిగిన శారీరక, బౌధ్ధిక్ ద్వారా నేర్పిన, నేర్చుకున్న అభ్యాసం ద్వారా వ్యక్తిత్వ, దేశ భక్తి భావంతో హిందూ దేశంగా ప్రపంచ వ్యాప్తంగా దేశం గుర్తింపు తెచ్చుకుందని భరత్ జీ చెప్పారు. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కోవిడ్ లో ప్రపంచానికే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత హిందువులదేనని అన్నారు. ఇందుకు ప్రతీ రోజూ జరుగుతున్న శాఖే ప్రధానమని ఈ సందర్భంగా భరత్ జీ మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో  బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజున సాయంత్రం ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని భరత్ జీ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ్ పుల్ టైమ్ వర్కర్లు రాజశేఖర్, గంగాధర్, అలాగే రమణమూర్తి, పరమహంస రమణ, కృష్ణంరాజు, తోట శ్రీధర్,శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అద్దెలు చెల్లించని వారిని మసీదు కాంప్లెక్స్ షాపుల నుండి పంపేయాలి

Satyam NEWS

రైతులు ఆగమవ్వద్దు ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది

Satyam NEWS

జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment