30.7 C
Hyderabad
April 29, 2024 03: 16 AM
Slider హైదరాబాద్

భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖ అప్రమత్తం

#HyderabadElectricity

గ్రేటర్ హైదరాబాద్ నగరం లో కురుస్తున్న అకాల భారీ వర్షం నేపధ్యం లో విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి సమీక్షించారు.

భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయాలని ఆయన కోరారు.

వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే  1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సీఎండీ జి రఘుమా రెడ్డి కోరారు.

Related posts

కుటుంబ సభ్యులే వైయస్ వివేకానంద రెడ్డిని దారుణంగా చంపేశారు

Satyam NEWS

సీరియస్ ఎలిగేషన్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మతి భ్రమించింది

Satyam NEWS

కరోనా సెకండ్ వేవ్.. అలసత్వం వద్దు

Sub Editor

Leave a Comment