39.2 C
Hyderabad
April 28, 2024 12: 43 PM
Slider నల్గొండ

సమస్యలు తీర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన గ్రామీణ వైద్యులు

#uttamkumarreddy

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి కమ్యూనిటీ, పారా మెడికల్ శిక్షణ తరగతులు పునః ప్రారంభించి, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి న్యాయం చేయాలని హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ,సభ్యులు శుక్రవారం కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.         

తెలంగాణ రాష్ట్రంలోని 40,000 మంది ఆర్ఎంపీ,పి.ఎం.పి, గ్రామీణ వైద్యుల కుటుంబాల సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి అర్ధాంతరంగా నిలిచిపోయిన కమ్యూనిటీ పారా మెడికల్ శిక్షణ తరగతులు పునః  ప్రారంభించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి న్యాయం చేయాలని కోరుతూ నవంబర్ శుక్రవారం సాయంత్రం ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్ డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి,గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు సమస్యలను తెలియజేసి న్యాయం చేయాలని కోరి వినతి పత్రం అందజేశారు.           

గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008 లో జీవో ఆర్ టి నెంబర్ 429 విడుదల చేసి రాష్ట్రంలోని ఆర్ఎంపి,పిఎంపి గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారా మెడిక్ గా గుర్తించి శిక్షణ విధానాన్ని రూపొందించి కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణ కొరకు 2009 సంవత్సరంలో జిఓ ఆర్ టి నెంబర్ 1273 ద్వారా 4.32 కోట్లు ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయించారని గుర్తు చేశారు.

2009 సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జిల్లా ఏరియా హాస్పిటల్స్ లలో కమ్యూనిటీ  పారా మెడిక్ శిక్షణ తరగతులు బ్యాచ్ ల వారీగా ప్రారంభం అయినాయని, తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణ తరగతులు అర్ధాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినాయని తెలిపారు.

ఎపిపిఎంబి,ఎపివివిపి హెచ్ ఎంఆర్ఐ, సమన్వయ లోపంతో 2011లో ప్రభుత్వ మెమో నెంబర్ 17685/12/2011 ద్వారా శిక్షణ తరగతులు పూర్తిగా నిలిపివేశారని,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సకలజనుల సమ్మెలో ఆర్ఎంపీ,పి.ఎం.పి,గ్రామీణ వైద్యులు కూడా జేఏసీగా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఉద్యమించారని గుర్తు చేశారు. 2014 సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్ఎంపి, పి.ఎం.పి, గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణ తరగతులు ప్రారంభించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రకటించిందని తెలిపారు.

అయితే ఆర్ఎంపి,పిఎంపి,గ్రామీణ వైద్యులు టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించి ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో జీవో నెంబర్ 428 విడుదల చేశారని, కానీ అట్టి జీవో ప్రకారం ఆర్ఎంపీ, పిఎంపి,గ్రామీణ వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో టీటీ ఇంజక్షన్ కూడా ఇవ్వడానికి వీలు లేకుండా నిబంధనలు పెట్టారని తెలిపారు.

ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడానికి వీలు లేకుండా కనీసం పారాసెట్మాల్ మందులు రాయటానికి కూడా వీలు లేకుండా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్ఎంపి సంఘాలు ముక్తకంఠంతో ఆ జీవోను వ్యతిరేకించారని వెల్లడించారు. జీవో ఆర్టీ నెంబర్ 429 ప్రకారం శిక్షణ తరగతులు పునః ప్రారంభించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలని గత తొమ్మిది సంవత్సరాలుగా ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ మంత్రులను కలిసి  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లను కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికి ఎలాంటి పురోగతి లేదని తెలిపారు.

వినతి పత్రాలు ఇచ్చి ఉన్నప్పటికీ  తెలంగాణ శాసనసభలో ఆర్ఎంపీ లకు న్యాయం చేస్తామని పలుమార్లు ప్రకటించి ఉన్నప్పటికీ కూడా నేటి వరకు ఎలాంటి న్యాయం ఆర్ఎంపీ,పీఎంపీ లకు జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ఎంపీ,పీఎంపీ లకు న్యాయం జరగకపోవడంతో సమాజంలో అనేక రకాల ఇబ్బందులు,బాధలు పడుతూ మానసిక వేదనకు గురి అవుతూ వస్తున్నారని,కరోనా కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది పేద ఆర్ఎంపి, పిఎంపి,గ్రామీణ వైద్యులు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ సూచనలు,జాగ్రత్తలు చెబుతూ కరోనా కాటుకు బలి అయిన సంగతి విధితమే అని తెలిపారు.

2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తమ సమస్యలను పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ విడుదల చేసి అర్ధాంతరంగా నిలిచిపోయిన కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణ తరగతులు పునః ప్రారంభించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి,సామాజిక వృత్తి భద్రత కల్పించి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలలో ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యులను భాగస్వాములను చేసి అర్హులైన వారిని పల్లె దవాఖానాలలో,బస్తీ దవాఖానాలలో నియమించేటట్లు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని ఆర్ఎంపి,పిఎంపి,గ్రామీణ వైద్యులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా తప్పనిసరిగా న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.

అన్ని వర్గాలకు అన్ని రంగాలతో పాటు ఆర్ఎంపి,పిఎంపీ లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం చేస్తామని ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మేళ్ళచెరువు మండల అధ్యక్షుడు మధిర బ్రహ్మారెడ్డి, నేరేడుచర్ల,పాలకవీడు మండల ప్రధాన కార్యదర్శులు లింగయ్య,జానయ్య,సిహెచ్ కోటేశ్వరరావు,బ్రహ్మం,ఎండి ఖాజా  మొయినుద్దీన్,రామచంద్రయ్య,ప్రకాష్ , జానీ మియా,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,మీరా  రాజశేఖర్,అమీనా,కొండా శ్రీను, నరసింహారావు,నాగయ్య,చారి,అబ్దుల్  రెహమాన్,వెంకన్న,ఖాసిం,సైదులు,మధు, కిషోర్,నియోజకవర్గం లోని ఏడు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

మైలార్‌దేవ్ ప‌ల్లిలో ఫ‌లించిన తోక‌ల వ్యూహం

Sub Editor

అతి శీతల ప్రదేశంలో హృదయవిదారక మరణం

Satyam NEWS

విపక్షాలు అన్నీ ఎక్కతాటిపైకి రావాలి

Bhavani

Leave a Comment