Slider కవి ప్రపంచం

ఆహ్వానం …

#Dr.Sammeta Vijaya

నెర్రల  భూమిని కొత్తగా

నెర్రలు పడిన పాదాలు తాకాయి

ఊసురంటున్న ఊరుకు

 ఉడుకు రక్తం తోడై

పల్లెలన్నీ తొలకరికి కొత్తరాగం అందుకున్నాయి

నమ్ముకున్న నగరి నట్టేట ముంచినా

 పచ్చదనం పల్లెచీర

తల్లికొంగు వోలె గుండెకు హత్తుకుంది

మనిషిని నమ్మి మట్టిగా మిగిలిన

గుండెల బొబ్బలకిపుడు

తొలకరి వాన చినుకులు కురిసి

ప్రకృతి లేపనమై సేదతీరుస్తుంది

గతజన్మల తాలూకు తాపీ పనుల

పేకమేడల ఆకాశ హర్మ్యాలు

చుక్కలయి భూమిమీద వాలాయి

భూమిపై నక్షత్రాల పంటకు సమయమాసన్నమైంది

స్వచ్ఛమైన గాలి  ఊరు నీదై

నీకోసం ఈ వేళ  ప్రపంచం

ముసుగులు తీసి ఊపిరిపోస్తూ

నీకోసం వేచి చూస్తుంది..

పొలంపై పరిచిన పంతం నీదైతే చాలు

ఏరువాక సాగు కొనసాగుతుంది

బక్కచిక్కిన రైతుకు నీ రెక్కతగిలించు

మట్టిని నమ్మితే ఫలితమేమిటో గమనించు

నగరిని నిండిన జనం పల్లెను పూరిస్తే

పచ్చని చెట్లు పులకరించడమేకాదు

బుక్కెడు మెతుకులను మోసంచేయక  పచ్చని తివాచీతో సహా  బహూకరిస్తుంది .

డా. సమ్మెట విజయ, హైదరాబాదు

Related posts

కాంట్ హెల్ప్:నౌకలోని భారతీయులను విడిపించలేం

Satyam NEWS

దళిత యువతి అత్యాచారంపై ఎస్ఎఫ్ఐ నిరసన

Satyam NEWS

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Bhavani

Leave a Comment