29.7 C
Hyderabad
May 1, 2024 07: 31 AM
Slider పశ్చిమగోదావరి

అనర్హుడికి ఇంటి పట్టా రద్దు చేయించిన ఆర్ డి ఓ

#elururdo

ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో  నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జూనియర్ విద్యుత్ లైన్ మెన్  జగనన్న లేవుట్ లో ఇంటి స్థలం పొందడానికి అనర్హుడని అతని భార్య పేరును మంజూరైన ఇంటి పట్టా రద్దు పరచాలని ఏలూరు ఆర్ డి ఓ కిషోర్ కుమార్ పెదవేగి తహసీల్దార్ నాగరాజు ని ఆదేశించారు. పంచాయతీ సి పి స్థలం లో మహిళా సాధికార భవనం నిర్మించుకుంటామని ద్వాక్రా మహిళలు బమ్మిడి రంగ, చోదిమెల్ల చంద్రావతి, యర్రా నాగలక్ష్మి, యర్రా తిరుపతమ్మ, చుంచుల రమాదేవి ఆర్ డి ఓ ని కలిసి వేడుకున్నారు.

ద్వాక్రా మహిళలు చెప్పిన సమస్యపై వెంటనే స్పందించిన ఆర్ డి ఓ ప్రభుత్వ జూనియర్ విద్యుత్ లైన్ మెన్ భార్య పేరును ఇచ్చిన పట్టా స్థలాన్ని పరిశీలించి పట్టా  రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆర్ డి ఓ రామసింగవరం గ్రామం దుర్గమ్మకాలనిలో 470 మంది నిరుపేదలకు పంపిణీ చేసిన జగనన్న ఇళ్ల స్థలాల లేవుట్ ను ఎం ఆర్ ఓ నాగరాజుతో కలిసి పరిశీలించారు. లేవుట్ లో ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా నిర్మిస్తున్న సుమారు 40 గృహాల నిర్మాణ దశలను క్షుణ్ణంగా ఆర్ డి ఓ కిషోర్ కుమార్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన లేవుట్ లో పట్టాలు పొందిన 20 మంది ఎస్ టి లబ్ధిదారుల కుటుంబాలను సందర్శించారు. వారి జీవన శైలిపై ఆరాతీశారు. వారికికూడా గృహాల నిర్మాణాలు చేపట్టాలని ఎస్ టి ల కుటుంబాలకు నచ్చజెప్పారు. కాలనీ గృహాలకు వాడుతున్న ఇసుక, ఐరన్, సిమెంట్ సరఫరా సక్రమంగా అందుతుందా అని కాంట్రాక్టర్ ని ఆరా తీశారు. తొలుత ఎం ఆర్ ఓ నాగరాజు అదే కాలనీ ప్రాంతం లో సర్వే నంబర్ 6 లో ఆక్రమణకు గురైన 90 సెంట్ల ప్రభుత్వ గయ్యాళి భూమిని పరిశీలించారు.

Related posts

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మార్పీఎస్

Satyam NEWS

కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తున్నటీడీపీ

Sub Editor

స్కూల్ ఎన్నికల నిర్వహణపై కార్యశాల

Bhavani

Leave a Comment