40.2 C
Hyderabad
May 6, 2024 18: 46 PM
Slider ఖమ్మం

వరదల సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం సేవలకు సెల్యూట్

#ministerpuvvada

గోదావరి వరద విపత్తు సమయంలో ఏ ఒక్క ప్రాణానికి నష్టం జరుగుకుండా కాపాడుకున్నామని, జిల్లా యంత్రాంగపు సేవలకు సెల్యూట్ చేస్తున్నానని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఐటిడిఏ సమావేశపు హాలులో గోదావరి వరదలు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలు ముంపు తగ్గిన తదుపరి చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్యసేవలు, విద్యుత్ పునరుద్ధరణ, సురక్షిత మంచినీరు సరఫరా, గోదావరి వరదల నుండి రక్షణకు కరకట్ట పటిష్టత తదితర అంశాలపై  ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, R&B, పిఆర్, మిషన్ భగీరథ, సింగరేణ,  విద్యుత్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ముంపు తగ్గిన తదుపరి ప్రజలు ఇళ్లకు చేరే లోగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను పరిశుభ్రం చేయించాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించి వారం రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని చెప్పారు. వరదల వల్ల కలిగిన నష్టం, తదువరి చేపట్టాల్సిన పనులకు అయ్యే అంచనా వ్యయాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున గోదావరి వరద ముంపుకు గురికాంకుడా ఆయా మండలాల్లో చేపట్టాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులు కార్యాచరణ నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. కరకట్ట పటిష్టత, బండ్ ఏర్పాటు, పట్టణంలో మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన పనులపై అంచనా నివేదికలు తయారు చేయాలని చెప్పారు. పోలవరం వల్ల ఇబ్బందులు రాకుండా పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. ముంపు తగ్గిన తదుపరి అంటువ్యాధులు ప్రబల కుండా చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదనపు సిబ్బంది ఏర్పాటు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పర్ణశాల సబ్ స్టేషన్ ముంపుకు గరవుతున్నందున ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు. వరదలపై సియం కేసీఅర్ గారు ఏరియల్ సర్వేతో పాటు సమీక్షా సమావేశం నిర్వహిస్తారని, అధికారులు ఆయా శాఖలకు వరదలకు కలిగిన నష్టాలు, తిరిగి పునరుద్ధరణకు అవసరమైన నిధులు కొరకు నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.

వరదల వల్ల 72 గ్రామ పంచాయతీలు ముంపుకు గురయ్యాయని, దాదాపు 10 వేల ఇళ్లు ముంపుకు గురైనట్లు చెప్పారు. దాదాపు 20 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు అదనపు సిబ్బంది ఏర్పాటు ద్వారా పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని డిపిఓకు సూచించారు.

వరదలు తగ్గిన తదుపరి అతి పెద్ద టాస్క్ ఉంటుందని, మైదాన ప్రాంత సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వరద పరిస్థితులు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లాకు నియమించిన సిసిఎల్ఎ డైరెక్టర్ రజత్ కుమార్ సైనీ, సింగరేణి సియండి శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు ఆయా శాఖల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద మంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకునేలోగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామాను పరిశుభ్రం చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా ముంపు నుండి ప్రజలను కాపాడారని అభినందించారు. ముంపు తగ్గిన తదుపరి పెద్ద టాస్క్ ఉంటుందని అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. చాలా పెద్ద విపత్తు వచ్చిందని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి గారు చాలా ఫోకస్ చేస్తున్నారని ప్రభత్వం సహాయ సహాకారాలు అందిస్తున్నదని చెప్పారు.

జట్టింగ్ యంత్రాలు వినియోగం ద్వారా బురద తొలగించే చర్యలు చేపట్టాలని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా కరకట్ట బలోపేతం తదితర అంశాలపై కార్యాచరణలు సియం గారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పోలవరం వల్ల కూడా పట్టణంలో మూడు ప్రాంతాల్లో స్లూయిల్లలో నీరు నిలిచే అవకాశం ఉందని సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు బ్లీచింగ్, లైమ్ సమృద్ధిగా ఉంచుకోవాలని చెప్పారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణకు రాజమండ్రి నుండి ప్రత్యేక పారిశుధ్య కార్మికులను తెప్పించాలని చెప్పారు. 3 రోజుల్లో తగినంత ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.

ఆయా ప్రాంతాలలో వ్యాధులు ప్రబల కుండా చేపట్టాల్సిన చర్యలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వరద తగ్గిన తదుపరి పాములు, తేళ్లు వంటి విషజంతువులు జనావాసాలలోకి వస్తుంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటిబాటిక్ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఫీవర్ సర్వే నిర్వహించి తక్షణ వైద్య సేవలు అందించాలని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మిషన్ బగీరథ అధికారులను ఆదేశించారు. ట్యాంకులను బ్లీచింగ్ తో పరిశుభ్రం చేయించాలని చెప్పారు. లీకేజిలను అరికట్టాలని చెప్పారు. వరదల విద్యుత్ నిలిపి వేసిన గ్రామాల్లో తక్షణ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు.

వరదల వల్ల విద్యుత్ సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ వైద్య సేవలు నిర్వహణకు ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు వైద్యులతో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. జ్వర ప్రభావిత ప్రాంతాల్లో వైద్య కేంద్రాలు నిర్వహించాలని చెప్పారు. అత్యవసర మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

వరదలు తగ్గిన తదుపరి వైద్య సేవలు, పారిశుధ్య కార్యక్రమాలు, విద్యుత్ పునరుద్ధరణ అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, సింగరేణి CMD శ్రీధర్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంత రావు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం డిపిబి రమాకాంత్, వైద్యాధికారి డాక్టర్ దయానందస్వామి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, మిషన్ బగీరథ ఈఈ తిరుమలేష్, విద్యుత్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వర్షానికి ఆటో బోల్తా: యువతి మృతి

Satyam NEWS

ప్రతి ఉపాధ్యాయుడు ఆంగ్ల శిక్షణలో పాల్గొనాలి

Satyam NEWS

కడప జిల్లా బద్వేలు లో జగనన్న వసతి దీవెన

Satyam NEWS

Leave a Comment