27.7 C
Hyderabad
April 30, 2024 08: 28 AM
Slider హైదరాబాద్

జ‌ర్న‌లిస్టుపై సామ తిరుమ‌ల‌రెడ్డి అనుచ‌రుల దాడి!

Sama Tirumala Reddy2

స‌మాజానికి ద‌శ దిశ‌గా నిలిచే జ‌ర్న‌లిజంపై కొంద‌రు నాయ‌కులు క‌త్తులు దూస్తున్నారు. ఇప్ప‌టికే నిజ నిజాలు వెలికితీసే పాత్ర‌లో విశేషంగా ప్ర‌య‌త్నిస్తున్న మీడియాను టార్గెట్ చేస్తున్నారు కొంద‌రు దుండ‌గులు.

తాజాగా హ‌య‌త్‌న‌గ‌ర్ కార్పోరేట‌ర్ అనుచ‌రులు ఓ విలేఖ‌రిపై ‌దాడుల‌కు తెగ‌బ‌డింది. తామేమీ త‌క్కువ తిన‌లేద‌ని క‌లం క‌న్నా క‌త్తి గొప్ప‌ద‌ని చెప్ప‌క‌నే విలేఖ‌రిపై దాడితో రుజువు చేసింది. ఈ దాడులు ఇలాగే కొన‌సాగితే రానున్న కాలంలో విధులు నిర్వ‌హించ‌లేమంటూ పెన్‌డౌన్ చేస్తామంటూ.. కెమెరా క‌న్ను మూస్తామంటూ జ‌ర్న‌లిస్టు సంఘాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. వెంట‌నే విలేఖ‌రిపై దాడికి పాల్ప‌డిన దుండ‌గుల‌ను అరెస్టు చేసి ఆ దాడికి మూల‌కార‌ణ‌మైన సామ తిరుమ‌ల రెడ్డిపై అన‌ర్హ‌త వేటు వేయ‌డంతోపాటు అత‌ను తిరిగి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని స్ప‌ష్టం చేశాయి.

సామ తిరుమ‌ల్‌రెడ్డి ఆర్థిక‌, అంగ బ‌లం, రాజ‌కీయ బ‌లంతో ఓ నిరుపేద కుటుంబం స్థ‌లాన్నిక‌బ్జా చేశాడు. ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వెళుతున్న‌తిరుమ‌ల‌రెడ్డిని అడ్డుకోవ‌డానికి ఆ కుటుంబం ప్ర‌య‌త్నించింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆ విలేఖ‌రి త‌న కెమెరాతో అక్క‌డి విష‌యాల‌ను షూట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు. దీంతో తిరుమ‌ల‌రెడ్డి అనుచ‌రులు విలేఖ‌రిపై దాడికి తెగ‌బ‌డ‌డ‌మే గాకుండా, అత‌ని ఫోన్‌ను కూడా ధ్వంసం చేశారు.

విష‌యం తెలుసుకున్న జ‌ర్న‌లిస్టులు, సంఘాలు కాస్త సామ తిరుమ‌ల‌రెడ్డి ఇంటిముందు ధ‌ర్నా నిర్వ‌హించారు. వెంట‌నే దాడి చేసిన వారిని అరెస్టు చేసి సామ తిరుమ‌ల‌రెడ్డిని రాజ‌కీయాల‌లో నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

సామ తిరుమ‌ల‌రెడ్డిపై గ‌తంలోనే అనేక ఆరోప‌ణ‌లు

సామ తిరుమ‌ల‌రెడ్డి ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ భూక‌జ్జాలకు పాల్ప‌డ‌తాడ‌ని, ఎక్క‌డ ఇళ్లు క‌ట్టినా అత‌ని వ‌ద్ద నుంచి లంచం డిమాండ్ చేస్తాడ‌ని అత‌నిపై అనేక ఆరోప‌ణ‌లున్నాయి. భారీ లారీల‌ను అడ్డుకోవాల‌ని ఓ మారు ఎల్బీన‌గ‌ర్ న‌డిరోడ్డుపై ఆర్టీవో అధికారి కాళ్ళు మొక్కుతున్న‌, మ‌రో మారు వ‌న‌స్థ‌లిపురం పాన్‌షాపును కూల్చిన ఘ‌ట‌న‌, ఓ రైతు భూమిని లాక్కునేందుకు ప్ర‌య‌త్నించి సంద‌ర్భాలు ఉన్నాయి. ఇవైతే మ‌చ్చుకు కొన్నే ఇంకా ఇత‌ని చేష్ట‌లు అనేకం ఉన్నాయ‌ని, ఓ మారైతే ఏకంగా మ‌హిల ఇంట్లో ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో చొర‌బ‌డి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం.. ఈ విష‌యం పెద్ద ఇష్యూ కావ‌డంతో అధికారుల కాళ్ళ వేళ్ళా ప‌డి కేసును వాప‌సు తీసుకునేలా చేయ‌డం ఇది సామ తిరుమ‌ల‌రెడ్డి నిజ స్వ‌రూప‌మ‌ని స్థానికులు ఛీద‌రించుకుంటున్నారు.

ఇప్ప‌టికైనా ఇలాంటి రాజ‌కీయ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోకుంటే ప్ర‌జ‌లే ఆయా నేత‌ల‌పై తిరుగ‌బ‌డే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంటుంద‌ని అప్పుడు ప్ర‌జ‌లే చ‌ట్టాన్నితీసుకునే ప‌రిస్థితిని క‌ల్పించ‌వ‌ద్ద‌ని ఆయ‌న బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

కార్మికవర్గ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఏఐటీయూసీ నిర్విరామ పోరాటాలు

Satyam NEWS

భారత్ వ్యాక్సిన్ పై దుష్ట చైనా కుట్రలు బట్టబయలు

Satyam NEWS

Leave a Comment