29.7 C
Hyderabad
April 29, 2024 08: 14 AM
Slider సంపాదకీయం

చంద్రబాబును కట్టడి చేయలేకపోతున్న జగన్

#jagan (1)

‘‘ఆ ముసలాయన’’ అంటూ చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరచూ ఎగతాళి చేస్తుంటారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చంద్రబాబు వయసును హేళన చేయడం కుసంస్కారానికి నిదర్శనం అని విమర్శలు వచ్చినా వైసీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు విషయం తెలిసిన వెంటనే డ్యాన్సులు చేసిన మంత్రులను చూసి ఇదా సంస్కారం అంటూ ఏపి ప్రజలు మండిపడుతున్నారు.

ఎగతాళి చేసిన జగన్ రెడ్డికి ఇప్పుడు ‘‘ముసలాయన’’ బలం ఏమిటో తెలుస్తున్నది. బెయిల్ రాకుండా చేయడానికి వైసీపీ న్యాయ బృందం పడుతున్న శ్రమ ఒక వైపు, చంద్రబాబు అరెస్టును సాధ్యమైనంత వరకూ ప్రచారం చేసి రాజకీయ లాభం పొందాలనుకునే వైసీపీ సోషల్ మీడియా టీం మరొక వైపు రాత్రింబగళ్లూ పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఒక్క ముసలాయన బలం ఏమిటో ఆయనే ప్రజలు తెలుసుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల గాను ఏ ఆధారాలు లేని కేసులో వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తే కానీ ఆయనను జైల్లో పెట్టలేకపోయారు. అత్యంత ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోయి ఇటు అసెంబ్లీలో… అటు ఢిల్లీలో బలం లేకుండా నిస్సహాయుడిగా ఉండిపోయినా కూడా చంద్రబాబును జగన్ ఏమీ చేయలేకపోయారు. చివరికి పేరు లేని ఎఫ్ఐఆర్ లో… అవినీతి చేశారో.. నిధులు దుర్వినియోగం చేశారో కూడా స్పష్టంగా చెప్పలేని కేసులో.. అసలు నేరుగా సీఎంకు సంబంధం ఉండని కేసులో అరెస్ట్ చేశారు.

ఇది ఆయనను దెబ్బకొట్టడం అవుతుందో.. లేకపోతే ఆయన బలాన్ని ప్రజల ముందు ఉంచడం అవుతుందో ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు కులం, ప్రాంతం పేరుతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఆయన రాజకీయం అభివృద్ది సెంట్రిక్ గా ఉంటుంది. అది ఆయన బలహీనత. తాను అభివృద్ది చేస్తానని మాత్రమే ఆయన చెబుతుంటారు… ప్రజలను… వారి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని కల్పించేలా మాత్రమే ఆయన పాలనా విధానాలు ఉంటాయి. అధికారంలో ఉంటే పార్టీని కూడా పట్టించుకోరు. అది ఆయన బలమో బలహీనతో. కానీ ఆయనను దెబ్బకొట్టాలంటే… మాత్రం… ఆషామాషీ కాదు. ఇంటికి లక్షలు పంచాలి… వేధించాలి.. మానసికంగా దెబ్బకొట్టాలి… ఇన్ని చేసినా ఏం జరుగుతుంది… ఆయన రోజు రోజుకూ గట్టిగా నిలబడుతున్నారు. అక్రమాలపై కలబడుతున్నారు.

అన్ని వ్యవస్థల్ని వాడుకుంటే…. ఢిల్లీ స్థాయిలో మద్దతు లభిస్తేనే ఆయనను జైలుకు పంపగలిగారు కానీ.. ఆయన పోరాటాన్ని ఆపలేరు కదా.

చంద్రబాబు కూడాజైలుకు వెళ్తున్నారు.. ఇక నేను నిప్పును అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదని… కొంత మంది వైసీపీ మేధావులు సంతృప్తి పడుతూంటారు. ఆయన నిజాయితీని నమ్మేవారు…. ఎవరూ జైలుకు పంపినంత మాత్రాన ఆయన నిప్పు కాదని నమ్మరు. ఆయన ప్రోత్సాహంతో చరిత్ర సృష్టించిన నాటి డెక్కన్ ఏవియేషన్ గోపీనాథ్ దగ్గర్నుంచి నేటి జోహో అధిపతి వరకూ అందరూ ఆయనను గుర్తుంచుకుంటారు…. నిజాయితీపరుడిగానే. ఆయన అవినీతి పరుడని నమ్మిన వారు.. ఆయనేం చెప్పిన నమ్మరు. ఒక్క ముసలాయన్ని కొట్టడానికి ఎంత పెద్ద స్థాయిలో వ్యవస్థల దుర్వినియోగం జరిగిందో…..అదే ఆయన అసలైన బలం. దటీజ్ ముసలాయన. ఈ రోజు ఇంతటితో ఆగిపోదు. రేపు అనేది లేకుండా పోదు. కాలమే అన్నింటికీ సాక్ష్యం.

Related posts

వైసీపీ సైకోలకు సరైన వైద్యం చేసేందుకు మేమున్నాం

Satyam NEWS

విశాఖలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

Bhavani

విజయనగరం లో ఎత్తు బ్రిడ్జి వద్ద దారుణం…

Satyam NEWS

Leave a Comment