29.7 C
Hyderabad
April 29, 2024 08: 28 AM
Slider నిజామాబాద్

13 వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

#protest

సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకొక రీతిలో తమ నిరసన కొనసాగిస్తున్నారు. 13 వ రోజు నిరసనలో భాగంగా శనివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేసి తమ నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ హామీ ఇచినట్టుగా తమను రెగ్యులరైజ్ చేయాలన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, తమ హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. 13 రోజులుగా తాము నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ తమ సమస్యలను పట్టించుకుని తమను విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

Satyam NEWS

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించరాదని భాజపా నిరసన

Satyam NEWS

Digital disaster of Dharani portal

Satyam NEWS

Leave a Comment