27.7 C
Hyderabad
May 7, 2024 09: 47 AM
Slider ముఖ్యంశాలు

ఫలించిన ‘నేనుసైతం’ పోరాటం: ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం

#narayanapet

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫీయాపై గత పదేళ్ళుగా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని, ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపాలని నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లను సోమవారం కలసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయమై 15 రోజుల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి, ఇసుక మాఫియాను కట్టడి చేస్తానని, సోమవారం సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తో మీడియా సాక్షిగా ఇచ్చిన హామిని అమలు చేసే దిశగా జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాచరణను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం స్వయంగా మరికల్ పొలీస్ స్టేషన్ పరిధిలోని రాకొండ, పూసల్పాడ్, బండర్ వల్లి వాగులను స్వయంగా పరిశీలించారు.

ఈ నేపథ్యంలోనే   రాకొండలో ఎలాంటి నెంబర్ పేట్లు లేని వంద ట్రాక్టర్లను గుర్తించారు. అదే విధంగా నాలుగు భారత్ బెంజ్ లారీలను గుర్తించారు. ఈ సందర్బంగా ట్రాక్టర్, లారీల యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ వెంకటేశ్వర్లు వెంటనే ట్రాక్టర్లుకు నెంబర్ పేట్లు వేసుకోవాలని, లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం మరికల్ పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, ఇసుక మాఫియాకు సహకరిస్తే ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని, సస్పెన్షన్ కు సైతం వెనుకడనని ఈ సందర్భంగా మరికల్ పోలీసులను ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

నేనుసైతం చేస్తున్న పోరాటంపై ఎస్పీ వెంకటేశ్వర్లు స్పందించి ఇసుక మాఫీయా నియంత్రించే దిశగా చర్యలు చేపట్టడంపై సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇసుక మాఫీయాపై ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవడంపై ఈ సందర్బంగా నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లుకు నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడి అ ప్రజాస్వామికం

Bhavani

జడ్జిమెంట్: ప్రతిపక్షాలకు మళ్లీ కర్రు కాల్చి వాత పెట్టారు

Satyam NEWS

CMRF చెక్కులను అందజేసిన ప్రజా ప్రతినిధులు

Satyam NEWS

Leave a Comment