38.2 C
Hyderabad
May 2, 2024 22: 21 PM
Slider కడప

అవసరాల మేరకు ఇసుక నిల్వలు ఉండాలి

#SandSupply

వినియోగదారుల అవసరాల మేరకు ఇసుక నిల్వలను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం గౌతమి సంబంధిత  అధికారులను ఆదేశించారు. గురువారం కడప సబ్ కలెక్టర్ పృధ్వి తేజ్ తో కలసి రాయచొటి ఇసుక డిపోను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఇసుక నిలువలను, రికార్డులను పరిశీలించారు. జిల్లా ఇసుక అధికారికి ఇసుక నిల్వలు పెంచడం, వినియోగ దారుల సరఫరా గురించి సూచనలు చేసారు.

రాయచోటి ఇసుక డిపోకు కొమరునిపల్లె, కిచ్చమంబాపురం పట్టా భూముల నుండి ప్రతి రోజు 500 టన్నుల మించి ప్రతి రోజు తరలించాలని, అందుకు తగినట్టుగా ప్రణాళికను సిద్దం చేసుకువాలని సూచించారు.

ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాల నిమిత్తం ట్రాక్టర్ల ద్వార ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఇసుక నిల్వలు, సరఫరా అంశాలలో రిజిస్టర్లు పరిశీలించి సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇసుక అధికారి, రాయచోటి తాసిల్దారు రాయచోటి తాసిల్దారు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ చరిత్రకు తూట్లు పొడుస్తున్న స్వార్థపరుల ప్లాట్లు

Satyam NEWS

హ్యాట్రిక్ హిట్ కొట్టిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

Bhavani

కుక్కల బెడద నుండి హుజూర్ నగర్ పట్టణ వాసులని రక్షించండి

Satyam NEWS

Leave a Comment