29.7 C
Hyderabad
May 3, 2024 04: 14 AM
Slider ఆదిలాబాద్

సరైన వేతనం ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు

#SanitationWorkers

సరైన వేతనం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెడుతున్న ఏజీల్ గ్రూప్ కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా శానిటేషన్ పెసెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ నిరసన ధర్నా చేపట్టారు.

నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఏరియా జడ్జిఖాన ఆసుపత్రుల ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తూ G.O 68 ప్రకారం  పది వేల రూపాయలు వేతంగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

కేవలం రూ.6200 మాత్రమే కార్మికులకు ఇస్తూ మిగతా డబ్బులు దోచుకుంటున్నారని వారన్నారు. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే GO 68 ప్రకారం 10 వేల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

కరోనా మహమ్మరిని పారదోలడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కార్మికులకు PPE కిట్లు గ్లౌజులు మాస్కులు బూట్లు శనిటైజర్ అన్ని రకాల సౌకర్యాలు వెంటనే కల్పించాలని వారు కోరారు.

కరోనా సమయంలో పని చేస్తున్న తమకు రిస్కు ఎలవెన్సు రోజుకు 300 చొప్పున మార్చి నెల నుండి ఇప్పటి వరకు ఇవ్వాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో రాజమణి, శాంత శేఖర్ పద్మ రాజు దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తొలి మహిళా పార్క్ ప్రారంభించే మహిళా మంత్రి

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ ధర్నా

Satyam NEWS

సప్తగిరి మాసపత్రికతో బాటు ‘రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు’

Satyam NEWS

Leave a Comment