29.7 C
Hyderabad
May 3, 2024 05: 02 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ సిఎస్ గా శాంతికుమారి

#santikumariias

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా  ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. తనకు సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసిఆర్ ని కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో  వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Related posts

ట్రయిల్ రన్: విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ రెడీ

Satyam NEWS

ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్

Satyam NEWS

నిండుకుండలా మూసి నది

Bhavani

Leave a Comment