29.7 C
Hyderabad
April 29, 2024 07: 04 AM
Slider కృష్ణ

ట్రయిల్ రన్: విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ రెడీ

benz circle

విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పై రేపటి నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ప్రారంభోత్సవం చేయకుండానే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నిన్న జాతీయ రహదారుల విభాగం సంచాలకుడు విద్యాసాగర్, ట్రాఫిక్ డీసీపీ నాగరాజులు వంతెనను తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు రేపు మరోసారి వంతెనను పరిశీలించి వాహనాలకు పచ్చజెండా ఊపుతారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి చేతులు మీదుగా వంతెనను ప్రారంభిస్తారని భావిస్తున్నారు. ముందుగా ఈ వంతెనను నిర్మల కాన్వెంట్ వరకే నిర్మించాలనుకున్నారు. భవిష్యత్తు అవసరాలను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి కూడలి వరకు పొడిగించాలన్న అప్పటి సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేనిల విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించి అనుమతించింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంజి సర్కిల్ లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

Related posts

బిజెపి నుంచి జెంప్: ప్రజా సంక్షేమంకై తెరాస లో చేరిక

Satyam NEWS

ఖమ్మంలో జరిగే షర్మిల ‘సంకల్ప సభ’ను జయప్రదం చేయండి

Satyam NEWS

ప్రూవ్డ్ కరెక్ట్: విశాఖ తరలివెళ్లడంపై సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది

Satyam NEWS

Leave a Comment