27.7 C
Hyderabad
May 15, 2024 05: 18 AM
Slider నల్గొండ

సర్ధార్ చకిలం శ్రీనివాసరావు శతజయంతి ఉత్సవాలు

#chekilam

బుడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా,కమ్యూనిష్టుల కంచు కోటలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న గొప్ప నాయకుడుగా ఎదిగిన చకిలం శ్రీనివాసరావు శతజయంతి ఉత్సవాలు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.పలువురు చకిలం శ్రీనివాసరావు అభిమానులు ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ అభిమానులు,చకిలం శ్రీనివాసరావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నర్సింహరావు తనయుడు పి.వి.ప్రభాకరరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు చకిలం శ్రీనివాసరావు అభిమానులైన హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి,బడుగు బలహీన వర్గాల వారికి తన సేవలను అందించి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడుగా ఎదిగిన వ్యక్తి చకిలం శ్రీనివాసరావు అని అన్నారు.

నేడు సర్ధార్ చకిలం శ్రీనివాసరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపిన మార్గంలో అభిమానులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో,పట్టణంలో చకిలం అనుయాయులు,అభిమానులు ఉన్నారని,వారందరూ ఏకమై సర్ధార్ చకిలం ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

నల్లగొండ జిల్లా వేములపల్లి గ్రామంలో 1922వ,సంవత్సరం ఫిబ్రవరి 22న, జన్మించిన చకిలం శ్రీనివాసరావు భారత కాంగ్రెస్ పార్టీ నుండి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడుగా పనిచేశారని,ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడుగా మూడు పర్యాయాలు ఎన్నికై ప్రజాసేవకు అంకితమైన మహనీయుడని, నేటి తరం రాజకీయ నాయకులు స్వార్ధం కోసం కాకుండా చకిలం శ్రీనివాసరావు ను ఆదర్శంగా తీసుకొని ప్రజా సేవ చేయాలని కోరారు.ప్రజాసేవ చేసిన నాయకులే చరిత్రలో ధృవ తారగా నిలుస్తారని, అటువంటి కోవకు చెందిన నాయకులలో సర్ధార్ చకిలం శ్రీనివాసరావు ఒకరని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో బాచిమంచి గిరిబాబు,నారపరాజు పురు‌షోత్తమరావు, చెన్నూరు విజయ్ కుమార్,భువనగిరి శ్యామ్ సుందర్,ధూళిపాళ రామకృష్ణ ప్రసాద్,కొండపల్లి సింగమోహన్, బొబ్బిళ్ళపాటి శేషు,రంగరాజు వాసుదేవ రావు,యల్లాపురం నర్సింహారావు, రమణారావు,ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని నియోజకవర్గ,పట్టణ,గ్రామాల నుండి భారీ సంఖ్యలో చకిలం శ్రీనివాసరావు అభిమానులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

యారియా కోసం ములుగు రైతుల ధర్నా

Satyam NEWS

విద్యల నగరంలో విద్యార్ధులతో మాటకలిపిన మంత్రి బొత్స

Satyam NEWS

Leave a Comment