Slider తెలంగాణ

యారియా కోసం ములుగు రైతుల ధర్నా

seetakka

రైతులకు చాలినంత యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు నియోజక వర్గం లోని ఏటూరునాగారం వై జంక్షన్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రైతులకు అవసరమైన  యూరియా బస్తాలు అందించాలని కోరుతూ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు  నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో ధర్నా రాస్త రోకో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పే కెసిఆర్ ఇప్పుడు రాష్ట్రం లో రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి ఉండే పరిస్థితి తెచ్చారని అన్నారు. ఈ రాష్ట్రం లో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క అన్నారు. అనంతరం ITDA ఎదుట ధర్నా చేస్తున్న రీలే నిరాహార దీక్ష చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల ను ఉద్దేశించి కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, జడ్పీటీసీ కరమ్ చెందు, ఎంపీపీ లు  జనగాం సమ్మక్క చెరుకూరి సతీష్ కుమార్ సర్పంచ్ ఈసం రాంమూర్తి, మండల అధ్యక్షులు అనంతరెడ్డి జయరాం రెడ్డి అప్సర్.చిటమాట రఘు మోహన్ రావు, రాంబాబు, ఇర్సవడ్ల వెంకన్న, బొల్లు దేవేందర్, పాకసాంబన్న

ముజఫర్, గుమ్మడి సోమన్న, కొమురం ధనలక్ష్మి, గుడ్ల దేవన్న, అయూబ్, ఖలీల్  ఖాన్, భగవాన్ రెడ్డి, బానోత్ రవి చందర్, ముషినపెల్లి కుమార్ గౌడ్ ఆకుతోట చంద్ర మౌళి, జాటోత్ గణేష్ మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Murali Krishna

ఉత్సవాలు విజయవంతం

Murali Krishna

కార్మికులను బానిసత్వం లోనికి నెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది

Satyam NEWS

Leave a Comment