32.2 C
Hyderabad
May 2, 2024 01: 38 AM
Slider నిజామాబాద్

సత్యం న్యూస్ ఎఫెక్ట్: అదనపు కలెక్టర్ వాహనం చలాన్లు క్లియర్

#pendingchallan

నిన్న సత్యం న్యూస్ లో ‘అదనపు కలెక్టర్ కారుకు భారీగా చలాన్లు’ శీర్షికతో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. టీఎస్ 17 సి 7299 నంబర్ గల అదనపు కలెక్టర్ వాహనంపై జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓవర్ స్పీడ్ పై 9 చలాన్లు ఉన్నాయి. వీటిపై 9315 రూపాయలు పెండింగులో ఉండగా సత్యం న్యూస్ ఈ విషయాన్ని వార్తగా ఇచ్చింది. దాంతో అధికారులు స్పందించారు. రాత్రికి రాత్రి పెండింగ్ చాలన్లను క్లియర్ చేశారు. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

అధికారుల నిర్లక్ష్యాన్ని వార్తలు వస్తేనే స్పందిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు ఎప్పటికప్పుడు చలాన్లు పెండింగ్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదనపు కలెక్టర్ వాహనం చలాన్లు బయట పడటంతో కలెక్టర్ వాహనంపై ఎన్ని చలాన్లు పెండింగులో ఉన్నాయని సాధారణ ప్రజలు వెతకడం.ప్రారంభించారు. దాంతో కలెక్టర్ కు చెందిన TS16EE3366 నంబర్ గల వాహనంపై 2 పెండింగ్ చలాన్లకు గాను 2070 రూపాయలు చెల్లించాల్సి ఉంది. గత సంవత్సరం ఏప్రిల్, జూన్ నెలలో పడిన చలాన్లు ఇప్పటికి పెండింగులోనే ఉండగా వాటిని కూడా క్లియర్ చేస్తే బాగుంటుందని, తద్వారా అధికారులను చూసి సాధారణ ప్రజలు కూడా ఆదర్శంగా నిలుస్తారని చర్చించుకుంటున్నారు.

జనరల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ వాహనానికి చలాన్లు

ఒక అధికారి వాహనంపై ఉన్న వాహనాలపై వార్త వచ్చినప్పుడు మిగతా అధికారులు అలర్ట్ అవుతారు. కానీ కామారెడ్డి జిల్లాలో ఉన్నతాధికారుల తీరు మరోలా ఉంటోంది. ఇప్పటికే అదనపు కలెక్టర్ వాహనంపై అధిక చలాన్లు ఉన్నాయని, వాటిని క్లియర్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యం న్యూస్ లో వచ్చిన వార్తకు స్పందించి పెండింగ్ చలాన్లన్నీ క్లియర్ చేశారు. కానీ అదే బాటలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వాహనంపై కూడా చలాన్లు భారీగానే ఉండిపోయాయి. ఆయనకు చెందిన TS09FR8218 నంబర్ గల వాహనంపై 9 చలాన్లు ఉండగా 9415 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంది.

2021 సెప్టెంబర్ 17 న శంషాబాద్ పరిధిలోని అన్నపూర్ణ ఎక్స్ రోడ్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనానికి 1100 ఫైన్ పడగా ఫిబ్రవరి 28, 2022 రోజు సదాశివనగర్ మండలం దగ్గి, మార్చి 25 సదాశివనగర్ మండలం మల్లుపేట, మే 14 న అల్వాల్ పరిధిలోని రేకుల బావి, జూన్ 2 న నార్సింగ్ పరిధిలోని వల్లబాపూర్ ఎక్స్ రోడ్, జులై 22 న చిక్కడపల్లి పరిధిలో అప్పర్ ట్యాంక్ బండ్, సెప్టెంబర్ 15 న చేగుంట పరిధిలోని వడియారం బైపాస్, జనవరి 15 న సదాశివనగర్ మండలం మల్లుపేట, డిచ్ పల్లి హైవే పై ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వాహనానికి 1000 రూపాయల చొప్పున మొత్తం 9415 జరిమానా పడింది. జిల్లా స్థాయి అధికారులకే తమ వాహనాలపై ఫైన్లు ఉన్నాయో లేదో.. ఉంటే క్లియర్ చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రాంగ్ రూట్లో అడిషనల్ కలెక్టర్ వాహనం

Related posts

అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ

Murali Krishna

పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం

Satyam NEWS

జగన్ కేబినెట్ పైనల్ లిస్టు ఇదే

Satyam NEWS

Leave a Comment