29.7 C
Hyderabad
April 29, 2024 08: 33 AM
Slider కృష్ణ

పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం

పుంగనూరు ఘటనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని తెలుగు దేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

పుంగనూరు కేంద్రంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన యాత్రలో జరిగిన ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల పర్యటనకు కనీసం పోలీసులు భద్రతను కల్పంచటం లేదని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. విజయవాడలో రాజ్‌భవన్‌కు వెళ్లిన నాయకులు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, ఫోటోలు, వీడియోలను కూడా సమర్పించారు. పులివెందుల్లోనే గొడవ పెట్టుకోవాలనే కుట్ర చేశారని తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గవర్నర్‌కు వివరించారు.

కుట్ర కోణం దాగి ఉంది…

రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన తరువాత తెలుగు దేశం నాయకులు మీడియాతో మాట్లాడారు. పులివెందుల్లో చంద్రబాబు సభకు వచ్చిన జనాన్ని చూసి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోకముడిచారని, తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య వ్యాఖ్యానించారు.

పెద్దిరెడ్డి నేతృత్వంలో అంగళ్లులో అరాచకం సృష్టించారని అన్నారు. పోలీసులు ప్రేకక్షుల్లా మారారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రివెంటీవ్ అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ అరాచకానికి పెద్దిరెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. పెద్దిరెడ్డే స్వయంగా సారాయి పోసి చంద్రబాబు సభపై దాడులు చేయించారని విమర్శించారు.

ఎస్పీ రిషాంత్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని టీడీపీ నేతలు అన్నారు. పెద్దిరెడ్డి కుట్ర పన్నారు కాబట్టి అరెస్ట్ చేయాలన్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌పై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గవర్నర్ అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారు కానీ.. డీజీపీ ఇవ్వడం లేదన్నారు.

వైసీపీది గుండా గిరి…

ఏపీ గుండా రాజ్యంగా మారిందని తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రతిపక్ష నేతను అంతం చేయాలనే దుర్మార్గ ఆలోచనతో జగన్ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో అమరావతిలో చంద్రబాబు బస్సుపై దాడి చేయించారని, చంద్రబాబు ఇంటి మీద కూడా దాడి జరిగిందని అన్నారు. తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం వంటి సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు.

టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి సహా అన్ని ఘటనలను కూడా సీఎం జగన్ సహా పోలీసులు సమర్థించుకున్నారని చెప్పారు. చంద్రబాబు 2500 కిలోమీటర్లు పర్యటిస్తుంటే.. దారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. చంద్రబాబును అడ్డుకుంటామని యథేచ్ఛగా తిరుగుతోన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు.

డీజీపీ కనీసం తమని కలవడానికి కూడా ఇష్టపడడం లేదని దీంతో చివరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నరుకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని, ఎస్పీ రిషాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు.

Related posts

ప్రొటెస్ట్ ర్యాలీ:మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్టు

Satyam NEWS

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

Satyam NEWS

ముఖేష్ అంబానీ కుటుంబానికి ఇక Z+ భద్రత

Satyam NEWS

Leave a Comment