కవి ప్రపంచం

మొదటి పేజీ

#MuluguLaxmimaidhili22

నిన్నటికి వీడ్కోలు

నేటికి ఆహ్వానం

నడక పాతదే

అదే తూరుపు..అదే సూర్యోదయం

దారులే కొత్తవి కావాలి

కాలచక్రం తో పోటీ పడుతూ

ఎన్నో మలుపులు

కన్నీళ్ళు..ఆనందాలు

ఆత్మీయులతో పంచుకున్న

మధుర క్షణాలు

పాతకొత్తల మేలు కలయికతో

కాలం ఒడిలో..అనుభవాల బడిలో

కాలెండర్ పాతబడి పోయింది

గత సంవత్సరం లో

నేర్చుకున్న పాఠాలు..గుణపాఠాలు

కష్టాలు..సుఖాలు..

అన్యాయాలకు..అక్రమాలు

ప్రేమలు..ప్రతీకారాలు ఎన్నో చూసాం

ప్రతి హృదయం

ఏదో సాధించాలన్న తపన

మరేదో కోల్పోతున్న ఆవేదన

ఈ మూడువందల అరవైరోజుల కాలం

తీపి చేదుల సంగమం

నిన్నటి అధ్యాయం చివరి పేజిలో

నిలిచిపోయిన ఆశలను..ఆశయాలను

నూతన అధ్యాయం

మొదటి పేజీలో మొదలెడదాం

గతకాలపు నిరీక్షణ నుండి

రేపటి అన్వేషణ సాగిద్దాం

నవ్యవత్సరంలో అడుగిడే

ప్రతి మలుపులో

ఓ కొత్తదనం కోరుకుంటూ

జీవితాన్ని ప్రేమిస్తూ

కొత్త సంవత్సరానికి

శుభాకాంక్షలతో

శుభస్వాగతం పలుకుదాం!!

ములుగు లక్ష్మీ మైథిలి

Related posts

తొణికిన స్వప్నం

Satyam NEWS

మేమొక్కరమే

Satyam NEWS

వసంతం అంటే

Satyam NEWS

Leave a Comment