38.2 C
Hyderabad
May 3, 2024 20: 55 PM
Slider కవి ప్రపంచం

గురువు

#VVS Krishnakumari

పూజకి పువ్వులు కోద్దామని

వెళ్ళిన నాకు

ఇవ్వటమే గానీ తీసుకోవడం

తెలియని చెట్టులో

ప్రతిఫలాన్ని ఆశించని

దానగుణం అలవరచుకో

అని పాఠం చెప్పే

ఓ గురువు కనపడ్డాడు

అన్ని బాధలను మౌనంగా భరించే

ధరిత్రిని చూసినప్పుడు

ఎంతటి కష్షం కలిగినా

ఓరిమి పోగొట్టుకోవద్దు

అని చెప్పే

ఓ గురుమూర్తి గోచరిస్తుంది

వర్షాకాలం కోసం, నిరంతర శ్రమతో

ఆహారాన్ని భద్రపరచుకొంటూ

ముందు చూపుతో మసలుకో

అనే సందేశాన్ని ఇచ్చే

చలిచీమ కూడా ఓ గురువే

ఎత్తు నుండి అగాథం లోకి

జాలువారే జలపాతాన్ని

చూసినప్పుడు

అహంకారంతో ఎగసి పడితే

పతనం వైపు జారిపోవటం

తథ్యమని చెప్పే

ఓ ఆథ్యాత్మికత గురువు

దర్శనమిస్తాడు

పంచభూతాలంతటా

ఏదో ఒక రూపంలో నిబిడీకృతమై ఉన్న

ప్రతి ఒక్క పదార్థం

మానవాళకి గురువులే

ఆ గురువులందరికీ

నమస్సుమాంజలులు

పీ.వి.యస్. కృష్ణ కుమారి, తుర్కయాంజాల్,  9494510994

Related posts

కర్ఫ్యూ ఆదేశాలు తుంగలోకి..ఎస్పీ రావడంతో వ్యాపారస్థులు బెంబేలు..!

Satyam NEWS

జిల్లా పాలనలో జగన్ మరో కీలక నిర్ణయం

Satyam NEWS

ఆరోగ్య మంత్రిని కలిసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది

Satyam NEWS

Leave a Comment