42.2 C
Hyderabad
May 3, 2024 17: 19 PM
Slider విజయనగరం

కర్ఫ్యూ ఆదేశాలు తుంగలోకి..ఎస్పీ రావడంతో వ్యాపారస్థులు బెంబేలు..!

#VijayanagaramCity

రోజు లో 18 గంటల పాటు అమలులో ఉన్న లాక్ డౌన్ పుణ్యమా…కరోన కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.వారం రోజుల క్రితం ఇదే రోజున విజయనగరం జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 2 వేలు పైమాట.

అయితే జిల్లాలో పోలీసులు సమక్షంలో పకడ్బందీగా అమలు జరుగుతున్న కర్ఫ్యూ దృష్ట్యా కరోన కేసులు 800 లోపే రావడం ఒక రకంగా అటు రెవిన్యూ, ఇటు పోలీసులు చేపడుతున్న చర్యలే.తాజాగా మరో సారి విజయనగరం జిల్లా ఎస్పీతో రాజకుమారీ జిల్లా కేంద్రంలో అమలవుతున్న కర్ఫ్యూ సమయంలో అమలవుతున్న పరిస్థితి ని మరోసారి పరిశీలించారు.

ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత… జిల్లా కేంద్రం లోని కర్ఫ్యూ పరిస్థితి,శాఖా సిబ్బంది చేస్తున్న విధులను ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించారు. బంగ్లా నుంచీ బయలు దేరిన ఎస్పీ…ఆర్టీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట ,మూడులాంతర్లు, గంటస్థంభం, సీఎంఆర్, గూడ్స్ షెడ్ ,వయా బేరక్స్ ల వద్ద కర్ఫ్యూ పరిస్థితి పరిశీలించారు.

ఈ ఆకస్మిక పర్యటన లో లయన్స్ క్లబ్ ఎదురుగా ఓ గ్రాఫిక్స్ షాపు తెరచి ఉండటం, అలాగే మూడులాంతర్ల వద్ద ఓ జ్యూస్ షాప్ ఇంకా పంపిణీ చేస్తుండటాన్ని స్వయంగా చూసిన ఎస్పీ…తన గన్ మెన్ ల ద్వారా దగ్గరుండీ మూయించి వేసారు.

మరో వైపు ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు..తన ఎస్ఐ హరిబాబు, ఏఎస్ఐ రామకృష్ణ లతో న్యూపూర్ణ వద్ద ఇంకా తెరిచి ఉన్న షాపులు, రోడ్లపై తిరుగుతున్న వాహనాలను దగ్గరుండీ తన సిబ్బంది తో మూయించారు.

ఏదైనా కేసులు తగ్గాయన్న వార్తలతో అటు వ్యాపారస్థులలోనూ ,ఇటు ప్రజలలో కాస్త మార్పు వచ్చిందనటానికి కర్ఫ్యూ సమయం దాటినా ఇంకా కొనసాగిస్తున్నారనటానికి నిదర్శమని అంటోంది… సత్యం న్యూస్.నెట్

Related posts

అంటువ్యాదులు ప్రబలకుండా చర్యలు భద్రాచలం వద్ద

Bhavani

కొడుకును అడ్డుకున్నందుకు పోలీసులతో ఎంపీ గొడవ

Satyam NEWS

438 వ రోజు కృష్ణాయపాలెంలో రైతుల నిరసన దీక్ష

Satyam NEWS

Leave a Comment