25.2 C
Hyderabad
May 8, 2024 08: 17 AM
Slider ఆధ్యాత్మికం

బాసరలో నాగుల పంచమికి నిజంగానే వచ్చిన పాము

#Basara Temple

నాగుల పంచమి సందర్భంగా భక్తులు పూజలు చేస్తుండగా నిజంగానే పాము వచ్చేసింది. ఈ అద్భుతమైన సంఘటన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి సరస్వతి దేవి కొలువు తీరిన బాసరలో నేడు జరిగింది. శ్రావణమాసం నాగుల పంచమి పుణ్యతిథి కావడం తో వేద భారతి పీఠం లో మహా దేవునికి వృక్షనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ముందుగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకించి దూప దీప నైవేద్యం సమర్పించారు. అనంతరం వృక్షో రక్షతి రక్షితః అని వేదం చెప్పినట్టుగా బిల్వ పత్ర మొక్కలకు వేదమంత్రాలతో శాస్త్రీయ బద్ధంగా నాటారు. ఈ కార్యక్రమంలో బాసర పుణ్యక్షేత్రం ప్రథమ పౌరుడైన దయ్యాల లక్ష్మణరావు మండల ఉపాధ్యక్షులు ఓని నర్సింగ్ రావు , వేద భారతి పీఠం ఆస్థాన దిషులైన శ్రీ శ్రీ విద్యా నందగిరి స్వాములవారు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

 ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అక్కడకు నిజంగానే ఒక అతి పెద్ద పాము వచ్చింది. పాము కనిపించడంతో భక్తులు పూజలు నిర్వహించారు. నాగపంచమి శ్రావణమాసం మొదటి శనివారం అమ్మవారి ఆలయంలో లింగాకారములో పాము దర్శనం ఇవ్వడం ఇప్పటి వరకూ జరగలేదని, ఇది ఒక అద్భుతమని పండితులు చెబుతున్నారు.

Related posts

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

Satyam NEWS

ఎమ్మెల్యే బీరం, మాజీమంత్రి జూపల్లి తోడు దొంగలు

Satyam NEWS

వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

Leave a Comment