34.2 C
Hyderabad
May 19, 2025 17: 47 PM
Slider కవి ప్రపంచం

ప్రేమ పాత్రుడు

#Tadinada Bhaskararao Tanuku

తెలుగువాడు, ధీరోదాత్తుడు,

ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే నాయకుడు

రాజకీయవాది, జాతీయవాది

గొప్పరచయిత, నిష్కలంక దేశ భక్తుడు

ఎన్ని కష్టాలనయినా సమదృష్టితో స్వీకరించే మనసుగలవాడు…

విజ్ఞత,భావస్పష్టత,రాజకీయ చతురత,

జాతీయ,రాష్ట్ర రాజకీయాలను,తనదైన శైలిలో ప్రభావితం చేసే దక్షత

విశిష్టమైన శైలి,అసమాన ధైర్యశాలి,

సునిశిత రాజకీయ పరిశీలన,సమరశీలవ్యక్తిత్వం ఆయన సొంతం

నిజాయితీకే కాక, నిరాడంబరతకు నిలువెత్తునిదర్శనం పి.వి.నరసిం హరావు…

జనులనేత, హృదయపీఠంపై సుస్థిరస్థానం, గర్వించదగిన నాయక శిఖరం

రాజనీతిజ్ఞుడిలో విరాజిల్లే దార్శనికతల తెలివితేటలు

దౌత్య పరిణితి, రాజకీయ పురోగతి,

సానుకూల దృక్పధం, అనన్యసామాన్యం

విజ్ఞాన ఖని ఆయన జీవితం…

సమర్ధ పాలకుడిగా,ప్రజల ప్రేమపాత్రుడిగా

చాకచక్యంగా వ్యవహరించగల నాయకుడిగా

శక్తియుక్తులు,ప్రతిభాసంపన్నత,ప్రపంచాన్ని విస్మయపరచాయి

అభీష్టాలకు అనుగుణంగా,అడుగులుముందుకు వేయించాయి

విజయానికి విలక్షణంగా నిలిచాయి,విజయసంకేతంతో విహరించాయి…

జీవనకాలాన్ని, ఆలోచనలకు

సర్వస్వాన్ని దేశంకోసం, ప్రజలకోసం అర్పించి

సుగుణ సంపన్నమైన సాహిత్యాన్ని అందించి

జీవితం సార్ధకం చేసుకున్నారు

చిరస్థాయిగా నిలిచారు…

తాడినాడ భాస్కర రావు, తణుకు, సెల్.నెం.9441831544

Related posts

Colour Dreams: ఐఏఎస్ లూ ఆగండి ఆలోచించండి

Satyam NEWS

జగన్ రెడ్డిని ఏ వన్ గా చేర్చాలి

Satyam NEWS

బాధ్యతలేని ముఖ్యమంత్రి కార్యాలయం మెడకు ఉచ్చు లాంటిదే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!