34.7 C
Hyderabad
May 4, 2024 23: 09 PM
Slider కవి ప్రపంచం

స్వేచ్ఛాభార‌తికి మ‌రో విజ‌యం

#Maddali Raghuram

అప్పుడేమో మ‌న దేశ‌సంప‌ద‌పైన క‌న్ను

ఇప్పుడేమో మ‌న ఆరోగ్య భాగ్యం పైన్న క‌న్ను

ఆనాడు తెల్ల‌దొర‌ల‌నే విదేశీయులు

ఈనాడో విదేశాల్లో పుట్టిన విష‌బీజాలు

అది నీతిమాలిన‌త‌నం

ఇది నిర్ల‌క్ష్య స్వ‌భావం

అప్పుడు, ఇప్పుడు

పొరుగు దేశ‌పు రాక్ష‌స‌త్వం

ఈ బంగ‌రు దేశాన్ని ప‌ట్టిపీడించింది

ఆరోజు ఒక ఖ‌ద్ద‌రు గొంతు ఖంగుమంటే

జాతి మొత్తం ప్ర‌తిధ్వ‌నిని ఇచ్చింది

ఈరోజు ఒక నేత దీపం వెలిగిస్తే

అది ధ‌న్వంత‌రీరూప‌మై దేశ‌మంతా ప్ర‌కాశించింది

అహింస‌, స‌హాయ‌నిరాక‌ర‌ణ‌, విదేశీవ‌స్తు బ‌హిష్క‌ర‌ణ‌

ఆయుధాలు నాడు

ముఖాన మాస్క్‌, భౌతిక‌దూరం, ప‌రిశుభ్ర‌త‌

తిరుగులేని ఉప‌క‌ర‌ణాలు నేడు

స‌మ‌ర‌యోధుల‌కు, ధ‌న్వంత‌రుల‌కు

శ్వేత‌వ‌స్త్రాలే, అస్త్రాలు

స్వేచ్ఛాభార‌తికి మ‌రో విజ‌యం త‌థ్యం

– మ‌ద్దాళి ర‌ఘురామ్‌, 9866057777

Related posts

ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు

Satyam NEWS

సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలివ్వాలి

Satyam NEWS

Leave a Comment